చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా
చెన్నై: చిన్నపిల్లలను పెట్టి పోర్న్ వీడియోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న మూడు గ్యాంగులను చెన్నై పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో తమిళనాడు పోలీస్ శాఖ సైబర్ సెల్ శాఖ గుర్తించింది. అంతేకాదు సైబర్ సెల్ ఆ ఐపీ అడ్రస్‌లను కూడా గుర్తించింది. అంతేకాదు ఈ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని తమిళనాడు అడిషనల్ డీజీపీ రవి చెప్పారు.
పోర్న్ వీడియోలు చూస్తున్నాడంటూ ఓ యువకుడిని పోలీసు బెదిరించడం అనే వార్తలు రావడంపై స్పందించిన అడిషనల్ డీజీపీ రవి, అది ఫేక్ అని తేల్చేశారు. ఇప్పటి వరకు మూడు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులను గుర్తించి ఇవి తయారు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఇక ఎవరైతే పోర్న్ వీడియో తీసి వాటిని డౌన్‌లోడ్ చేసి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారో వారిని గుర్తించి సంబంధింత జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చామని వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు మొబైల్ ఫోన్‌లపై నిఘా పెట్టామనేది అవాస్తవమని చెప్పారు.

పోక్సో చట్టం ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం చిన్నపిల్లలను అసాంఘీక కార్యకాలాపాల్లోకి దించడం నేరం. అంతేకాదు లైంగికపరమైన అంశాల్లోకి చిన్నపిల్లలను బలవంతంగా దించడమనేది నేరం. అంతేకాదు పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారు అలాంటి వెబ్‌సైట్‌లను సందర్శిస్తే వారిపై నిఘా పెడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అడిషనల్ డీజీపీ రవి. వారందరిపై నిఘా పెట్టడం సాధ్యం కాదని చెప్పిన రవి... పిల్లలను బలవంతంగా సెక్సువల్ యాక్టివిటీస్‌లోకి దించుతున్న వారిపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులను సమన్వయం చేసుకుని పనిచేసేలా నోడల్ అధికారిగా జయశ్రీ అనే ఎస్పీని నియమించినట్లు రవి చెప్పారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications