Chilli Chicken: లవ్ మ్యారేజ్, చిల్లీ చికెన్ చెయ్యలేదని రెండో భార్యను చంపేసిన భర్త, అసలు మ్యాటర్ వేరే !

బెంగళూరు/ దావణగెరె: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం సంతోషంగా తిరిగిన తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి అయువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ సమయంలో ప్రియుడితో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకుని అతనితో కాపురం పెట్టింది. దంపతులకు కుమార్తె పుట్టింది. కూతురు పుట్టేవరకు గుడ్ బాయ్ గా ఉన్న భర్త తరువాత మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. తన భర్తకు ముందే పెళ్లి అయ్యిందని, ఆమెకు పిల్లలు పుట్టకపోవడం వలనే తనను ప్రేమించి మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి పీకలదాక మ్యదం సేవించిన ఇంటికి వెళ్లిన భర్త భోజనంలోకి చిల్లీ చికెన్ చెయ్యలేదని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో కత్తి తీసుకుని భార్యను దారుణంగా చంపేసిన భర్త ఎస్కేప్ అయ్యాడు.

పిల్లలు పుట్టలేదని ?

పిల్లలు పుట్టలేదని ?

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర తాలుకాలోని బన్నికొడు గ్రామంలో కెంచప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రోడ్డు రోలర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కెంచప్పకు 13 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అయితే కెంచప్ప దంపతులకు పిల్లలు పుట్టలేదు. తన భార్యకు పిల్లలు పుట్టలేదని కెంచప్ప ఆవేదన చెందేవాడని తెలిసింది.

ముగ్గులోకి దింపేశాడు

ముగ్గులోకి దింపేశాడు

దావణగెరె జిల్లాలోని హరిహర తాలుకాలోని హసన గ్రామంలో శిల్పా అనే యువతి నివాసం ఉంటున్నది. 9 సంవత్సరాల క్రితం కెంచప్ప, శిల్పా ప్రేమించుకున్నారు. కొంతకాలం సంతోషంగా తిరిగిన తరువాత పెళ్లి చేసుకోవాలని కెంచప్ప, శిల్పా అనుకున్నారు. ప్రియుడు కంచప్పను పెళ్లి చేసుకోవడానికి శిల్పా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.

కూతురు పుట్టిన తరువాత లిక్కర్ బానిస

కూతురు పుట్టిన తరువాత లిక్కర్ బానిస

పెద్దలు వ్యతిరేకించిన సమయంలోనే ప్రియుడు కెంచప్పతో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్న శిల్పా అతనితో కాపురం పెట్టింది. కెంచప్ప, శిల్పా దంపతులకు కుమార్తె పుట్టింది. కూతురు పుట్టేవరకు గుడ్ బాయ్ గా ఉన్న కంచెప్ప తరువాత మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న కెంచెప్ప అతని భార్య శిల్పాతో గొడవ పెట్టుకుంటున్నాడు.

నేను రెండో భార్య అని తెలిసి ?

నేను రెండో భార్య అని తెలిసి ?

గత ఏడాది శిల్పాకు ఆమె భర్త గురించి అసలు విషయం తెలిసిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న శిల్పా షాకింగ్ విషయం తెలుసుకున్న బిత్తరపోయింది. తన భర్త కంచెప్పకు ముందే పెళ్లి అయ్యిందని, ఆమెకు పిల్లలు పుట్టకపోవడం వలనే తనను ప్రేమించి మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. అప్పటి నుంచి కెంచప్ప, శిల్పా దంపతుల మద్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

Recommended Video

    Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
    చిల్లీ చికెన్ చెయ్యలేదని భార్యను చంపేశాడు

    చిల్లీ చికెన్ చెయ్యలేదని భార్యను చంపేశాడు

    రాత్రి పీకలదాక మ్యదం సేవించిన కెంచెప్ప ఇంటికి వెళ్లాడు. భోజనంలోకి చిల్లీ చికెన్ చెయ్యలేదని కెంచెప్ప అతని భార్య శిల్పాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో కెంచప్ప, శిల్పాల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన కెంచప్ప కత్తి తీసుకుని అతని భార్య శిల్పాను దారుణంగా పొడిచి చంపేసి ఎస్కేప్ అయ్యాడు. చిల్లీ చికెన్ చెయ్యలేదని భార్య శిల్పాను ఆమె భర్త కంచెప్ప చంపేయడం హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+