వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిల్లింగ్ వీడియో: రద్దీ రోడ్డు మలుపులో.. కారు డోరు తెరచుకుని: జాగ్రత్తగా ఉండమంటోన్న పోలీసులు.. !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగించే రోడ్డు అది. రెండు జిల్లా కేంద్రాలను కలిపే మార్గం. కొండల మధ్య, ఘాట్ రోడ్డు గుండా ప్రయాణాన్ని సాగించాల్సి ప్రదేశం అది. అలాంటి చోట- డ్రైవర్లు మాత్రమే కాదు.. అందులో ప్రయాణించే వారు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మళ్లీ, మళ్లీ గుర్తు చేసే ఉదంతం ఇది. కేరళలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అలాంటి రోడ్డు గుండా వెళ్తోన్న ఓ కారు డోరు అకస్మాత్తుగా తెరచుకుని ఓ చిన్నారి రోడ్డు మీద పడింది. అదృష్టవశావత్తూ.. ఆ కారుకు ముందూ, వెనకలా వస్తోన్న వాహనాలన్నీ ఒక్కసారిగా నిలిచిపోయాయి. లేదంటే వాహనాల టైర్ల కింద ఆ చిన్నారి క్షణాల్లో నలిగిపోయి ఉండేదే. కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఇది. కోజికోడ్‌ నుంచి పత్తినంతిట్ట వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.

 Chilling Video: Childs Miraculous Escape After Falling Off A Moving Car in Kerala

కోజికోడ్‌కు చెందిన కుటుంబం కారులో పత్తినంతిట్ట వైపు వెళ్తున్న సమయంలో ఓ మలుపులో కారు డోరు అకస్మాత్తుగా తెరచుకోవడం, చిన్నారి అందులో నుంచి విసిరేసినట్టుగా రోడ్డు మీద పడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఆ కారుకు వెనుక ఓ ట్రక్కు, ముందు ఓ ప్రైవేటు బస్సు రాకపోకలు సాగించాయి. చిన్నారి కింద పడిన వెంటనే అటు ట్రక్కు, ఇటు ప్రైవేటు బస్సు డ్రైవర్ సడన్ బ్రేకులు వేశారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు అప్రమత్తంగా లేకపోయి ఉన్నా.. ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి పంకజ్ నయన్.. తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని ఈ ఉదంతం గుర్తు చేస్తోందని అన్నారు. కారు డోర్లను తప్పనిసరిగా లాక్ చేసుకోవాలని, లేదంటే ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అందరు పిల్లలూ ఆ చిన్నారిలా అదృష్టవంతులు కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

English summary
A video has surfaced on the internet which highlights the importance of child safety locks and child seats in cars after a child falls off a car in a busy road in Kerala. The video was shared by IPS Officer Pankaj Nain on his Twitter handle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X