పాకిస్తాన్ లో చైనా న్యూక్లియర్ సబ్ మెరైన్: భారత్ ఫై నిఘా కోసమేనా?
హిందూ మహాసముద్ర జలాల్లో చైనా న్యూక్లియర్ సబ్ మెరైన్ చక్కర్లు కొడుతోందనడానికి గట్టి ఆధారం గూగుల్ ఎర్త్ ద్వారా లభించింది. భారత్ పై నిఘా కోసమే చైనా వీటిని మొహరిస్తున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్ర జలాల్లో చైనా న్యూక్లియర్ సబ్ మెరైన్ చక్కర్లు కొడుతోందనడానికి గట్టి ఆధారం లభించింది. గత ఏడాది మేలో పాకిస్తాన్ లోని కరాచీ హార్బర్ లో చైనాకు చెందిన న్యూక్లియర్ అటామిక్ సబ్ మెరైన్ నిలిచి ఉన్న దృశ్యాన్ని గూగుల్ ఎర్త్ ఇమేజ్ స్పష్టం చేసింది.
చైనాకు చెందిన ఈ సబ్ మెరైన్ ఫోటోను తొలుత శాటిలైట్ ఇమేజరీ ఎక్స్ పర్ట్ పసిగట్టింది. అది చైనాకు చెందిన తొలి న్యూక్లియర్ పవర్ సబ్ మెరైన్ గా.. చైనీస్ నేవీ టైప్ 091 హాన్ క్లాస్ కు చెందిన సబ్ మెరైన్ తేలింది.
సంప్రదాయ సబ్ మెరైన్ లకు ఈ న్యూక్లియర్ పవర్ సబ్ మెరైన్ లు పూర్తి విరుద్ధం. ఇవి అతి తక్కువ ఇంధనంతో పనిచేయడం వల్ల ఎక్కువ కాలం నీటిలో ఉండి కార్యకలాపాలు నిర్వహించగలుగుతాయి. వీటి వేగం కూడా అధికం.

ఈ కొత్త న్యూక్లియర్ టైప్ 091 హాన్ క్లాస్ సబ్ మెరైన్... గతంలోన్ని చైనీస్ టైప్ 093 షాంగ్ క్లాస్ సబ్ మెరైన్ కంటే కూడా అధిక సామర్థ్యం కలదని భారత నౌకాదళ అధికారులు కూడా పేర్కొంటున్నారు.
భారత్ పై నిఘా కోసమే చైనా తమ సబ్ మెరైన్ లను హిందూ మహాసముద్ర జలాల్లో మొహరిస్తోందని, దీంతో తాము కూడా చైనా నౌకాదళ సబ్ మెరైన్ లు, నౌకలపై నిఘా వేశామని, భారత నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా తెలిపారు. మన ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ద్వారా వాటిని ఓ కంట కనిపెడుతూనే ఉన్నట్లు ఆయన చెప్పారు.
కొన్నేళ్లుగా హిందూ మహాసముద్ర జలాల్లో చైనీస్ సబ్ మెరైన్ లు తిరుగుతున్నట్లు భారత నౌకాదళం బలంగా విశ్వసిస్తోంది. హిందూ మహాసముద్ర జలాల్లోకి చైనీస్ సబ్ మెరైన్ లు రావాలంటే అవి కచ్చితంగా మలక్కా, లాంబోక్, సుందా జలసంధుల గుండా రావాల్సిందే.
అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో సబ్ మెరైన్ లు ఉపరితలంపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. దానివల్ల చైనీస్ సబ్ మెరైన్ లను భారత్ వంటి దేశాలు గుర్తించగలుగుతాయి.












Click it and Unblock the Notifications