వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్‌ప్రదేశ్ బాలుడ్ని భారత్‌కు అప్పగించిన చైనా పీఎల్ఏ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్ తరోన్‌ను చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తిరిగి అప్పగించింది. మిరామ్ తరోన్ ను చైనా సైన్యం అపహరించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం చెలరేగడంతో.. చైనా బలగాలతో హాట్‌లైన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలోనే ఆ యువకుడి ఆచూకీ లభించినట్లు పీఎల్ఏ గత ఆదివారం తెలిపింది. తాజాగా, గురువారం అతడ్ని భారత సైన్యానికి అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఇతర ప్రోటోకాల్స్ పాటిస్తున్నట్లు తెలిపారు.

 Chinas PLA returns missing Arunachal boy to Indian Army: Union minister Kiren Rijiju.

అప్పర్ సియాంగ్ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనా పీఎల్ఏ బలగాలు కిడ్నాప్ చేసినట్లు అరుణాచల్‌ప్రదేశ్ తూర్పు ఎంపీ తాపిర్ గావ్ మొదట ఆరోపించారు. మిరామ్ వెంటే ఉన్న అతని స్నేహితుడు జానీ యాయింగ్ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఆయన ట్వీట్ చేశారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను అదృశ్యంగా పేర్కొంది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సరిహద్దుల్లో మూలికలు సేకరణతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే చైనా బలగాలతో సంప్రదింపులు జరిపి తాజాగా అతడ్ని స్వదేశానికి రప్పించాయి.

English summary
China's PLA returns missing Arunachal boy to Indian Army: Union minister Kiren Rijiju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X