'మేడ్ ఇన్ చైనా 'ఆయుధాలతో పాకిస్థాన్ సిద్ధం.. పాక్ కు చైనా ఇచ్చిన సీక్రెట్ వెపన్స్ ఇవే..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభం కావచ్చనే సంకేతాలు ఉన్నాయి. ఇక పాకిస్థాన్ పూర్తిగా చైనానే నమ్ముకుంది. అటు పాకిస్థాన్ కు, ఇటు చైనా కు కామన్ శత్రువు భారత్ కాబట్టి.. చైనాను అడ్డం పెట్టుకుని ఈ యుద్దం నుంచి గట్టెక్కాలని పాకిస్థాన్ యత్నిస్తోంది.

అయితే భారత్- పాకిస్థాన్ యుద్ధం అంటే మొదట సంతోషించే దేశం చైనానే. ఆ దేశ అధ్యక్షుడు జెన్ పింగ్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు ప్రపంచ వార్తాకథనాలు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా రెండు కారణాలతో చైనా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. ఒకటి పాకిస్థాన్ కు దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు సరఫరా చేసిన ఆయుధాలతో పాకిస్థాన్ భారత్ తో పోరాడి దక్షిణాసియా ప్రాంతంలో భారత్ అధిపత్యాన్ని తగ్గిస్తుంది. ఇక రెండోది ఇప్పుడు పాకిస్థాన్ కు భారీగా ఆయుధ సామాగ్రి అవసరం కాబట్టి చైనాకు భారీగా పాకిస్థాన్ డబ్బు వస్తుంది. అందుకే భారత్- పాకిస్థాన్ యుద్ధానికి వెనక ఉండి ప్రోత్సహిస్తుంది చైనానే అనడంలో సందేహం లేదని ఇప్పటికే అనేక దేశాలు అభిప్రాయానికి వచ్చాయి.

ఇప్పటివరకు పాకిస్థాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82 శాతం చైనా సరఫరా చేసినవే. గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగింది. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్థాన్.. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా భావించవచ్చు.

పాకిస్థాన్ కు చైనా ఇచ్చిన అత్యాధునిక ఆయుధాలు ఇవే..

పాకిస్థాన్ కు చైనా సరఫరా చేసిన ఆయుధాల లిస్టులో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్. ఇలాంటివి ప్రస్తుతం పాక్ వద్ద 140 వరకు ఉన్నట్లు సమాచారం. అమెరికాతో డీల్ క్యాన్సెల్ తర్వాత చైనా వీటిని సరఫరా చేసింది. ఆ తర్వాత జే-10 సీఈ ఫైటర్ జెట్.. ఇది 4.5 మల్టీ జనరేషన్ ఫైటర్ జెట్. 2022లో పాకిస్థాన్ చైనా నుంచి 36 జే-10 సీఈ ఫైటర్ జెట్స్ దిగుమతి చేసుకుంది.

అంతేకాక టైప్- 05 ఏ ఫ్రిగేట్స్, టైప్- 041 హాంగర్ క్లాస్ సబ్ మెరైన్స్, వింగ్ లూంగ్ 2 డ్రోన్స్ , జెడ్- 10ఎమ్ ఈ ఎటాక్ హెలికాప్టర్స్, హెచ్ క్యూ- 9 డిఫెన్స్ సిస్టమ్స్, ఎస్- హెచ్ 15 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, పీఎల్- 15 మిసైల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలను దశాబ్దాలుగా చైనా పాకిస్థాన్ కు సరఫరా చేసింది.

ఇక పాకిస్థాన్- చైనా మధ్య ఏటా షాహీన్ ఈగల్ అనే పేరుతో యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. అంతేకాక అరేబియన్ సముద్రంలో ఇరు దేశాల మధ్య సాగర్ గార్డియన్ విన్యాసాలు కూడా జరుగుతాయి. ఈ క్రమంలో చైనా సరఫరా చేసిన ఆయుధాలు, సామాగ్రితో పాకిస్థాన్ భారత్ తో తలపడాలని భావిస్తోంది.

ఇక మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికార వర్గాలతో ప్రధాని మోదీ.. భేటీ అవుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాజాగా వైమానిక దళం చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. మోదీతో సమావేశం అయ్యారు. పాకిస్థాన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

China Supplies Advanced Weapons to Pakistan Full List Revealed

ఇప్పటికే సింధూ జలాల రద్దుతోపాటు, వీసాల జారీ రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత, పాకిస్థాన్ కు నీరు నిలిపివేత కారణంగా పాకిస్థాన్ సంక్షోభాన్ని అనుభవిస్తోంది. అటు ప్రపంచదేశాలు కూడా పాకిస్థాన్ వైఖరిపై తీవ్రంగా స్పందించాయి.

మరోవైపు ఈనెల 07న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్ చేపట్టాలని కేంద్ర హోంశాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. యుద్ధం ప్రారంభం అయితే ఎలా వ్యవహరించాలి. ఎలా తప్పించుకోవాలన్న దానిపై ప్రజలు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. దీంతో ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్దం తప్పదనే భావన అందరిలో కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+