భారత్ కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్: సన్నాయి మేళం

న్యూఢిల్లీ: మా వస్తువుల అమ్మకాన్ని బహిష్కరిస్తే అది ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చైనా భారత్ ను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అంతే కాకుండా చైనా వస్తువుల పై నిషేధం విధిస్తే ఇరు దేశాల పెట్టుబడులకు దెబ్బ తీస్తుందని చైనా చెప్పింది.

న్యూఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్ ఈ విధంగా స్పంధించారు. భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న చైనా కంపెనీల మీద వస్తు బహిష్కరణ ప్రభావం తీవ్ర స్థాయిలో పడుతుందని ఆయన హెచ్చరించారు.

China warns that boycoit of its goods will hurt ties

ఇరు దేశాల సంబంధాల విషయంలో భారత్ ఆచీతూచి వ్యవహరించాలని పరోక్షంగా సూచించింది. చైనీస్ వస్తువుల బహిష్కరణను ఇరు దేశాల ప్రజలు కోరుకోవడం లేదని జీ లియాన్ అన్నారు. దక్షిణాసియాలోనే చైనాకు అతి పెద్ద వాణజ్య భాగస్వామి భారత్ అని ఆయన గుర్తు చేశారు.

చైనా అత్యధికంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉందని జీ లియాన్ అన్నారు. భారత్ దాయాది పాకిస్థాన్ కు చైనా కొమ్మకాస్తుందని, అంతర్జాతీయ స్థాయిలో అడుగడుగునా చైనా అడ్డుపడుతందని భారతీయులలో చైనా వస్తువుల మీద వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే.

China warns that boycoit of its goods will hurt ties

చైనా వస్తువులను స్వచ్చందంగా బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీపావళి పండుగ సందర్బంగా చైనా టపాసుల మీద తీవ్రస్థాయిలో ఈ ప్రభావం చూపిస్తోంది.

ఈ నేపధ్యంలో చైనా రాయబారి జీ లియాన్ ఈ వ్యాఖ్యలు చెయ్యడం సంచలనం రేపింది. భారత్ అధికారికంగా చైనా వస్తువుల మీద నిషేధం విధించకపోయినా భారతీయులు స్వచ్చంధంగా చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు.

China warns that boycoit of its goods will hurt ties

ఈ విషయంపై ఆందోళన చెందిన చైనీస్ కంపెనీలు చైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చాయి. ఇదే సమయంలో న్యూఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్ కట్టి విరగకుండా, పాము చావకుండా భారత్ ను పరోక్షంగా హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+