మారని డ్రాగన్ బుద్ది: ఫింగర్ 4 వద్ద హెలీప్యాడ్ నిర్మాణం, ప్యాంగ్యాంగ్ లేక్ ఒడ్డున బలగాల మొహరింపు..

డ్రాగన్ చైనా బుద్ది ఎంత మాత్రం మారలేదు. తూర్పు లడాఖ్ ఘర్షణ తర్వాత ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇరుదేశాల మిలిటరీ హై కమాండర్ల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో సరిహద్దులో హెలీప్యాడ్ నిర్మిస్తూ.. బలగాలను మొహరిస్తూ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీసేలా వ్యవహరిస్తోంది. ప్యాంగ్యాంగ్ లేక్ వద్ద బలగాలను భారీగా మొహరించింది.

ఫింగర్ 4 వద్ద హెలీప్యాడ్‌ నిర్మాణాన్ని డ్రాగన్ కంట్రీ చేపట్టింది. ప్యాంగ్యాంగ్ లేక్ దక్షిణ ఒడ్డున చైనా భారీ బలగాలను దింపింది. దీంతో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు డ్రాగన్ కంట్రీ సుముఖంగా లేదు అని చర్యలతో అర్థమవుతోంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా చర్యలను భారత అధికారులు కూడా ధృవీకరించారు.

Chinese building helipad in Pangong Tso, massing troops on southern bank of lake

గత ఎనిమిది వారాల నుంచి చైనా వేగంగా తన పనులు చేసుకుంటూ వస్తుందని అధికారి తెలిపారు. హెలిప్యాడ్ నిర్మాణం, బలగాల మొహరింపు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం పాటుపడుతుందని వివరించారు. యథాతథ స్థితిని పునరుద్దరించడానికి చైనా సుముఖంగా లేదు అని, దీనికి ఆ దేశ చర్యలే అద్దం పడుతున్నాయని మరో అధికారి తెలిపారు.

చైనాను ఎదుర్కొనేందుకు బలగాలతో సిద్ధంగా ఉన్నామని.. కానీ సరిహద్దు ప్రాంతంలో విధించిన పరిమితుల మేరకు ఆగిపోయామని వివరించారు. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు నడుచుకొంటామని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో బలగాల మొహరింపు కాస్త కష్టంతో కూడుకున్న పనేనని అంగీకరించారు.

Recommended Video

    #IndiaChinaFaceOff : Galwan Valley లో China రహస్య నిర్మాణాలు.. వెలుగుచూసిన Satellite చిత్రాలు!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+