గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై షాకింగ్ రిపోర్ట్: అసలు విలన్ ఆయనే: తేల్చిన యూఎస్ ఇంటెలిజెన్స్
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సైనిక బలగాల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వైపులా 65 మందికి పైగా సైనికుల ప్రాణాలను కోల్పోయిన ఘర్షణలకు అసలు కారణాలేంటో నిలకడ మీద తేలుతోంది. సూర్యాపేట్‌కు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు సహా 20 మంది జవాన్ల ప్రాణాలను హరించిన చైనా దుశ్చర్యలపై అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం సీఐఏ ఫోకస్ పెట్టింది. తనకు ఉన్న నెట్‌వర్క్ ద్వారా కీలక సమాచారాన్ని సేకరించింది.
భారత జవాన్లపై ప్రాణాంతక దాడులకు పాల్పడేలా తమ దేశ సైనికులను ప్రేరేపించేలా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్టర్న్ కమాండర్ జనరల్ ఝావో జొంగ్‌క్వి ఆదేశాలను జారీ చేశారని సీఐఏ వెల్లడించింది. భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా చైనా బలగాలను భారత జవాన్లు అడ్డుకున్న సందర్భంగా.. వారిపై ప్రాణాంతక దాడులు చేయాలంటూ ఝావో జొంగ్‌క్వి అప్పటికప్పుడు ఆదేశించారని స్పష్టం చేసింది. ఈ దాడులపై సీఐఏ ఓ నివేదికను రూపొందించింది. భారత్‌లోకి చొచ్చుకుని వెళ్లడాన్ని అడ్డుకునే ఏ ఒక్క జవాన్‌ను కూడా వదలొద్దంటూ ఆయన ఆదేశాలను జారీ చేశారని పేర్కొంది.

జనరల్ ఝావో జొంగ్‌క్వి విధి నిర్వహణలో అత్యంత కఠినంగా ఉంటారనే పేరుందని వెల్లడించింది. అందుకే చైనా పీఎల్ఏ అధికారులు ఆయనను ఉద్దేశపూరకంగా భారత్ సరిహద్దుల్లో మోహరింపజేశారని సీఐఏ స్పష్టం చేసింది. జొంగ్‌క్వి హయాంలో చైనా బలగాలు తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని వస్తుంటారని, దీనికి అవసరమైన ఆదేశాలను ఆయనే జారీ చేస్తుంటారని అంచనా వేసింది సీఐఏ. ఈ సారి మాత్రం ఏకంగా ప్రాణాంతక దాడులకు పాల్పడేలా తమ దేశ సరిహద్దు బలగాలకు ఆయన లిఖితపూరకంగా ఆదేశించి ఉంటారని సీఐఏ అభిప్రాయపడింది.
మరోసారి తమను అడ్డుకోకుండా ఉండేలా భారత సైనికులకు గుణపాఠం చెప్పాలని జనర్ జొంగ్‌క్వి పీఎల్ఏ బలగాలకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి ఉండొచ్చని యూఎస్ ఇంటెలిజెన్స్ పేర్కొంి. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు, పీఎల్ఏ బలగాల దాడుల పట్ల భారత సైన్యం దిగ్భ్రాంతికి గురై ఉండొచ్చని, తేరుకుని ఎదురుదాడికి దిగేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సీఐఏ తన నివేదికలో పేర్కొన్నట్లు విదేశీ మీడియా స్పష్టం చేసింది. దీనిపై కొన్ని ప్రత్యేక కథనాలను ప్రచురించింది. భారత సరిహద్దు వివాదాల విషయంలో ప్రతీసారీ రెచ్చగొట్టేలా ఆయన వ్యవహరిస్తుంటారని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications