భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన యాంకర్: చైనా మీడియా ప్రశంసలు
తన భర్త చనిపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించిన చత్తీస్‌గఢ్ న్యూస్ యాంకర్ సుప్రీత్ కౌర్‌పై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది.
బీజింగ్/రాయ్‌పూర్: తన భర్త చనిపోయినా విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించిన చత్తీస్‌గఢ్ న్యూస్ యాంకర్ సుప్రీత్ కౌర్‌పై చైనా మీడియా ప్రశంసలు కురిపించింది. విధి నిర్వహణ పట్ల ఆమెకు ఉన్న విధేయత నిరుపమానమని ఛత్తీస్‌గఢ్‌లోని ఐబీసీ-24 ఛానెల్‌లో పని చేస్తున్న సుప్రీత్‌ను పేర్కొంది.
చైనాకు చెందిన పీపుల్స్ డైలీ, చైనా డైలీ, గ్లోబల్ టైమ్స్, షింగ్జువా న్యూస్ ఏజెన్సీతో పాటు పలువురు మీడియా ప్రతినిధులు ఆమె గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఐబీసీ-24 ఛానెల్‌లో పనిచేస్తున్న సుప్రీత్‌కౌర్ వార్తలు చదువుతుండగా బులిటెన్ మధ్యలో కారు ప్రమాదం గురించి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.

ఆ కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందిన విషయం ఆమెకు తెలిసినప్పటికీ బాధను దిగమింగుకొని, విధి నిర్వహణలో అంకితభావంతో బులిటెన్‌ను పూర్తి చేశారు. ఆమె హృదయవిదారక గాథ అందర్నీ కంటతడి పెట్టించింది. వృత్తి పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధిని చైనా మీడియా కీర్తించింది.
ఆమె వార్తలు చదివిన వీడియోను చైనా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పలువురు నెటిజన్లు ఆమెకు ఉద్యోగం పట్ల ఉన్న నిబద్ధతను కొనియాడుతున్నారు.
సుప్రీత్ కౌర్ తన వృత్తిని దైవంలా భావిస్తున్నారని, సుప్రీత్ గాథ వింటుంటేనే ఏడుపొస్తోందని, సుప్రీత్ చాలా ధైర్యవంతురాలని, సుప్రీత్ మనోధైర్యానికి సెల్యూట్... అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. వేలాది మంది చైనీయులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications