ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. గొంతులు తెగి మరో ఇద్దరు మృతి
సంక్రాంతి పండగంటే గాలి పటాలు ఎగురవేయాల్సిందే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ సంతోషంగా గాలి పటాలను ఎగురవేస్తుంటారు. అయితే ఎంతో సరదాగా ఆడుకునే ఈ ఆటలో చాలా ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే. పండగ వేళల్లో సరదాగా ఆడే ఈ ఆట కొందరి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గాలిపటాలు ఎగురవేసేందుకు చైనా మాంజాను ఉపయోగించడమే.. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో అనేకమంది ఈ చైనా మాంజా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా చైనా మాంజాతో గొంతు తెగి కర్ణాటకలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటక బీదర్ జిల్లాలోని తలమదగి బ్రిడ్జి వద్ద ఈ విషాదం జరిగింది. సంజు కుమార్ అనే వ్యక్తి బైకుపై వెళ్తున్న క్రమంలో గొంతుకు చైనా మాంజా తగిలింది. ఆ మాంజా దారం గొంతు లోపలి వరకు తెగింది. దీంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సంజును చూసిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సంజు కుమార్ చివరిసారిగా తన కూతురికి ఫోన్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేసే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సంజు కుమార్ బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ లేట్ గా రావడం వల్లే అతడు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రాణాంతక చైనా మాంజా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. చైనా మాంజా మెడకు చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం కలకలం రేపింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అవిదేశ్(35) అనే వ్యక్తి టూ వీలర్ పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా చైనా మాంజా అతడి గొంతుకు చుట్టుకుంది. దీంతో గొంతు తెగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం 2016 లోనే రాష్ట్ర వ్యాప్తంగా చైనీస్ మాంజాను నిషేధించింది. కానీ చాలా మంది వ్యాపారస్థులు అక్రమంగా వీటి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చైనీస్ మాంజాను నైలాన్, సింథటిక్ దారంతో తయారు చేస్తారు. చైనీస్ మాంజాతో పక్షులు, మనుషులు ప్రమాదంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ మాంజాపై పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications