దేశీ బీర్ కిక్కే వేరప్పా: తాగిన మత్తులో ఈ చైనా దేశస్తులు ఏమి చేశారో తెలుసా..?

న్యూఢిల్లీ: మీరట్‌లోని ఘర్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతుంటాయి. కానీ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఒక ఎస్‌యూవీ కారు రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న సాధారణ కారుపైకి రుయ్యిన దూసుకెళ్లింది. అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ కలిగిన స్పోర్ట్స్ యుటిలీటీ వెహికల్. సాధారణ కారు డ్రైవర్ రాజీవ్ రస్తోగీ ఆ కారులో ఎవరున్నారో తెలుసుకునేందుకు వెళ్లాడు. అయితే రస్తోగీ అందులో ఉన్న మనుషులను చూసి షాక్ తిన్నాడు.

ఎస్‌యూవీలో ఉన్న వారు చైనా దేశీయులు. ఇద్దరు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి కారును నడిపారు. అసలు ఒంటిపై బట్టలు కూడా లేవు. వారు నగ్నంగా కారులోనే స్పృహకోల్పోయి ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు జనం గుమికూడారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అంతలోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ చైనా దేశీయులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గ్వాకింగ్(45), వెంగ్జిన్ జు (51)గా గుర్తించారు. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి బట్టలు ఇచ్చారు పోలీసులు.

Chinese nationals caught in road accident..here is the answer what they gave

భారత్‌లో ఉన్న చైనా సంస్థలో వారు క్వాలీటీ కంట్రోల శాఖలో పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. భారత్‌కు చైనా నుంచి దిగుమతి అయ్యే మాంసాహార ఉత్పత్తులను వారు మానిటర్ చేస్తుంటారని పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు బట్టలు విప్పేశారని పోలీసులు అడుగగా వారికి మతిపోయే సమాధానం ఆ చైనా దేశీయుల నుంచి వచ్చింది. అదే... భయ్యా దేశీ బీర్ కిక్కే వేరుగుంది. మా మెదడు మా కంట్రోల్‌లో లేదనే సమాధానం రావడంతో పోలీసలు విస్మయానికి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+