వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియునిపై దాడి: చైనా యువతికి లైంగిక వేధింపులు

|
Google Oneindia TeluguNews

Chinese woman molested by domestic tourists at Candolim
పనాజి: గోవా రాష్ట్రంలోని పర్యాటక స్థలం కండోలం బీచ్‌లో చైనా దేశానికి చెందిన మహిళపై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు స్వదేశీ పర్యాటకులు ఆదివారం రాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఐదు రోజుల కస్టడీకి తరలించారు.

స్థానిక కలంగుటే పోలీసుల కథనం ప్రకారం.. చైనా పర్యటకురాలు, ఆమె ప్రియుడు కలిసి వారు బస చేస్తున్న రిసార్టు సమీపంలోని కండోలిమ్ బీచ్ రోడ్‌లో ఆదివారం రాత్రి 11.45గంటలకు నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు స్వదేశీ పర్యాటకులు వారితో మాట కలిపారు. ఆ తర్వాత నిందితులుగా గుర్తించిన ముస్తాద్ షేక్, అర్జున్ కుమార్, దుర్గేశ్ సింధాలు చైనా యువతి ప్రియునిపై దాడి చేసి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.

బాధితులు గట్టిగా అరవడంతో దగ్గరలో ఉన్న కొందరు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారి సహాయంతో పారిపోతున్న ముగ్గురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం సుమారు 2గంటల ప్రాంతంలో కలంగుటే పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

నిందితులు ముస్తాద్ షేక్, అర్జున్ కుమార్, దుర్గేశ్ సింధాలపై ఐపిసి 354, 323, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన ముగ్గురు స్వదేశీ పర్యాకులను ఐదు రోజుల కస్టడీకి తరలించినట్లు విచారణాధికారి సుశాంత్ గవాస్ తెలిపారు.

English summary
A 29-year-old Chinese tourist was allegedly molested by three inebriated tourists late Sunday night at Candolim. The three domestic tourists were arrested and remanded to five days police custody on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X