ప్రధానమంత్రితో చిన్నజీయర్ స్వామి భేటీ
చిన్నజీయర్ స్వామి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిథిగా హాజరు కావాలని ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ భేటీలో , మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా. జూపల్లి రామేశ్వరరావు సైతం పాల్గొన్నారు.
ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ ప్రముఖులు హైదరాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను ప్రధానికి వివరించారు. స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో కొలువుతీరిన 108 దివ్య దేశాల దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాల గురించి ప్రధానికి తెలియజేశారు.

అంతేకాకుండా, జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయం మరియు ఆయుర్వేద-హోమియో కళాశాలల పురోగతి గురించి కూడా ప్రధాని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామిని అభినందించారు. ఈ భేటీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాముఖ్యతను మరింతగా పెంచింది.












Click it and Unblock the Notifications