ఆయనైతే.. నేను విఐపినే: చిరుని నిలదీసిన యువకుడు
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి క్యూ లైన్లో వెళ్లకుండా.. నేరుగా వెళ్లి ఓటేసే ప్రయత్నాలు చేశారని, ఓటర్లు అడ్డుకోవడంతో ఆయన వరుసలో నిలబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను క్యూ లైన్లో నిలబడమని సూచించింది కార్తికేయ అనే యువకుడు అని సమాచారం.
చిరును నిలదీయడంపై కార్తికేయను మీడియా ప్రశ్నిస్తే... చిరంజీవి విఐపి అయితే తాను కూడా విఐపినే అవుతానని చెప్పారు. తన నివాసం జూబ్లీహిల్స్‌లోనే ఉందన్నారు. వారికి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడిగా చిరంజీవి పైన తనకు గౌరవం ఉందన్నారు.

ఆయన ఒక్కరు వచ్చినా తాను అభ్యంతరం చెప్పకపోయి ఉండేవాడినని కానీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా వచ్చారని అన్నారు. కుటుంబ సభ్యులను తీసుకు రావడంతోనే తాను అడిగానని చెప్పారు. జూబ్లిహిల్స్‌లో ఉంటున్నందున ఆయన విఐపి ఆయితే తాను విఐపినే అవుతానని చెప్పారు.
ఆనందంగా ఉంది: సైనా నెహ్వాల్
ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ తన ఓటు హక్కును వినియోగుంచుకున్నారు. గచ్చిబౌలిలోని టెలికామ్ నగర్‌లో ఓటు వేశారు. దాదాపు గంటపాటు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ.. మొదటిసారి ఓటు వేయడం చాలా గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications