వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యూ రగడపై చిరంజీవి వివరణ, నేరుగా వెళ్లి పవన్‌కళ్యాణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి క్యూ లైన్లో వెళ్లకుండా.. నేరుగా వెళ్లి ఓటేసే ప్రయత్నాలు చేశారని, ఓటర్లు అడ్డుకోవడంతో ఆయన వరుసలో నిలబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి ఓటు వేసిన అనంతరం వివరణ ఇచ్చారు.

తాను నిబంధనల మేరకు వరుసలో నిలబడే ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. తనకు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందన్నారు. తాను ఇన్నాళ్లు ప్రచారంలో ఉన్నందున.. జాబితాలో (లిస్ట్‌లో) తన పేరు ఉందా లేదా అని తెలుసుకునేందుకే వెళ్లానని, అంతే తప్ప నేరుగా ఓటేసేందుకు వెళ్లలేదన్నారు.

Chiru apologises, says democracy is priority

తాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా.. ఎలా ఉల్లంఘనకు పాల్పడుతానని ప్రశఅనించారు. తాను వరుసలో ఉండగానే తనకు ఫోన్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో కూడా స్క్రోలింగ్ వచ్చినట్లు చూశానన్నారు. తాను వరుసలోనే నిలబడి ఓటేశానని చెప్పారు. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి ఓటేసినట్లుగా తెలుస్తోంది.

ఎన్నికలపై...

ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చిరంజీవి అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా ప్రజలు ఓటేస్తారో నిపుణులు కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముందని తాను వార్తలు చూశానన్నారు. తెలంగాణ రావడానికి కాంగ్రెసు పార్టీయే కారణమని చెప్పారు.

English summary
Chiranjeevi said, he is proud to be a voter and respects democracy. "I am proud that people did the right thing (on him being reprimanded for jumping queue). I stood in line while buying tickets, now this."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X