'ఛోటీ మోనాలిసా' దొరికేసిందిరోయ్.. ఇంకా ఎంత మందిని చూడాలో..?
మహా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా గుర్తుంది కదా.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. అలా ఓవర్ నైట్ సెలబ్రిటి అయిపోయింది. కారణం ఆమె సహజమైన అందం. ఆకట్టుకునే రూపం.. తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. ఆమెతో ఓ సినిమా కూడా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం పేరు ది డెయిరీ ఆఫ్ మణిపుర్. ప్రస్తుతం అతని వద్దే మోనాలిసా నటనపై ప్రత్యేక శిక్షణ పొందుతోంది.

అయితే ప్రస్తుతం అదే రూపంలో ఉన్న మరో బుల్లి మోనాలిసా సామాజిక మాధ్యమాల్ని షేక్ చేస్తోంది. నలుపు రంగులో ఉన్న ఈ చిన్నారి అచ్చం కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మాదిరిగానే ఉండటం విశేషం. అవే తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో ఎంచక్కా రూడ్లపై తిరుగుతూ వస్తువులు అమ్ముతోంది. ఉజ్జయిని నగరంలోని గుడి వద్ద నిల్చొని వచ్చిపోయే భక్తులకు ఈ అమ్మాయి.. కుంకుమ, పసుపుతో బొట్టు పెడుతూ కనిపించింది. ఈమెను తన కెమెరాలో మనోజ్ వైష్ణవ్ అనే వ్యక్తి బంధించి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. మోనాలిసా ఛోటీ వెర్షన్.. అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మరో మోనాలిసా దొరికేసిందోచ్ అంటూ ఫన్నీ కామెంట్సూ వినిపిస్తున్నాయి. మన సహజమైన చిరునవ్వే.. మన అందం అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.












Click it and Unblock the Notifications