సీఎం పళనిసామికి సినిమా చూపిస్తున్న టీటీవీ, దినకరన్: రాలేదని !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఎడప్పాడి పళనిసామి దూరంగా ఉన్నారనే కోపంతో టీటీవీ. దినకరన్ తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారౌతున్నారని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ తమిళనాడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారౌతున్నారని సమాచారం. తమిళనాడులోని వివిద జిల్లాలకు చెందిన కలెక్టర్లను బదిలి చేయించాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

విశ్వసనీయ సమాచారం మేరకు వివిద జిల్లాల కలెక్టర్ల ను బదిలీ చేయించాలని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద ఒత్తిడి తీసుకురావాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే దినకరన్ తీరుపై ఎడప్పాడి పళనిసామి వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూసింది.

ఉప ఎన్నికల ప్రచారానికి !

ఉప ఎన్నికల ప్రచారానికి !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఎడప్పాడి పళనిసామి దూరంగా ఉన్నారు. తన గెలుపు కోసం ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోవడంలేదని టీటీవీ. దినకరన్ అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

వచ్చే నెలలో అయినా

వచ్చే నెలలో అయినా

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామిని చివరి నాలుగు రోజుల్లో రప్పించడానికి దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎడప్పాడి పళనిసామి, సీనియర్ మంత్రులు ఆర్ కే నగర్ లో ప్రచారం చెయ్యడానికి నిరాకరిస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

మొదటికే మోసం వస్తోందని ?

మొదటికే మోసం వస్తోందని ?

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసినా దినకరన్ గెలువలేక పోతే ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బహిరంగంగా వెలుగు చూసే అవకాశం ఉందని, అందుకే దూరంగా ఉండాలని ఎడప్పాడి ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

అనుచరులకు మద్దతు ఇచ్చే వారు కావాలని

అనుచరులకు మద్దతు ఇచ్చే వారు కావాలని

తన అనుచరుల పనులు చకచకా చేసే అధికారులు అవసరం అని దినకరన్ భావించారని, అందుకే పలు జిల్లాలకు ఆయనకు అనుకూలంగా ఉన్న కలెక్టర్లను బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

స్థానిక సామాజీక వర్గం మద్దతు

స్థానిక సామాజీక వర్గం మద్దతు

ఆర్ కే నగర్ లో దినకరన్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని స్థానిక క్రిస్టియన్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకుంది. గురువారం ఆర్ కే నగర్ కు చెందిన క్రిష్టియన్ ఫెడరేషన్ నాయకులు దినకరన్ ను కలిసి మద్దతు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+