రైల్వేశాఖ క్రిస్మస్ గిఫ్ట్ : డిసెంబర్ 25న ఈ లగ్జరీ రైలు ప్రారంభం..టికెట్ ఎంతో తెలుసా..?
షిమ్లా: రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది. క్రిస్మస్ సందర్భంగా హిమదర్శన్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించనుంది. కల్కా నుంచి షిమ్లా వరకు ఈ రైలు ప్రయాణించనుంది. ఈ రైలులో అన్ని ఆధునిక హంగులతో కూడిన ఏసీ కోచ్‌లు ఉంటాయి. డిసెంబర్ 24, 2020 వరకు ఈ రైలును నడపనున్నారు. విస్టాడోమ్ కోచ్‌లతో ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుంది. అంతేకాదు లోపల ఉన్న ప్రయాణికులు సుందరమైన ప్రదేశాలను చూసేందుకు వీలుగా రైలు కిటీకీలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
రైల్వేశాఖ ప్రకారం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌పై విస్టాడోమ్ కోచ్‌లున్న తొలిరైలు హిమ్‌దర్శన్ ఎక్స్‌ప్రెస్ అని అధికారులు తెలిపారు. కల్కా రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరే ఈ రైలు.. షిమ్లా రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 12:55 గంటలకు చేరుతుంది. తిరిగి షిమ్లా నుంచి మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి కల్కా రైల్వే స్టేషన్‌కు తిరిగి రాత్రి 9:15 గంటలకు చేరుతుంది. బరోగ్ రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మొత్తం ఏడు కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. ఇక విస్టా కోచ్‌లలో మొత్తం 15 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఫస్ట్ క్లాస్ కోచ్‌లో 14 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.

ప్రతి కోచ్‌లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు ఎయిర్ కండీషనర్లు, విశాలమైన యూపీవీసీ కిటికీలు, అడ్జస్టబుల్ లేదా రివర్సిబుల్ సీట్లు ఉన్నాయి. ఇక వెస్ట్రన్ కమోడ్లు, వాటర్ జెట్, వాష్ బేసిన్, లిక్విడ్ సోప్, కంటెయినర్, స్టీల్ డస్ట్‌బిన్, అడర్ ఫ్రెషనర్ కంటెయినర్, టాయిలెట్ పేపర్ రోల్ వంటి సదుపాయాలున్నాయి. ఇక ఈ రైలులో ప్రయాణించాలంటే టికెట్ ధర రూ. 630 చెల్లించాలి. అయితే విస్టాడోమ్ కోచ్‌లలో మాత్రం ఎలాంటి కన్సెషన్ ఉండదు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications