మగాడిని రేప్ చెయ్యాలని ప్రయత్నించిన ఎమ్మెల్సీ ?, సీఐడీ కస్టడీకి అప్పగించిన కోర్టు !

కర్ణాటకలోని హాసన్‌లో జేడీఎస్‌ మగ కార్యకర్తను స్వలింగ సంపర్కానికి ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై అరెస్టు అయిన జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను 8 రోజుల పాటు నేర పరిశోధన విభాగం సీఐడీ)కి అప్పగించారు.సూరజ్ రేవణ్ణపై హాసన్‌లో స్వలింగ సంపర్కం కేసు నమోదు కాగా ఆ కేసును సీఐడీకి అప్పగిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేసిన హాసన్ జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ కేసును సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో పోలీసులు సూరజ్ రేవణ్ణను నిన్న సాయంత్రం హాసన్ నుంచి బెంగళూరు తీసుకొచ్చి పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంచి విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం కోర్టుకు హాజరైన సీఐడీ పోలీసులు కేసు దర్యాప్తు నిమిత్తం జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ ను 14 రోజుల మా కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

CID investigating JDS MLC Suraj Revanna in custody

అయితే ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను 8 రోజుల పాటు సీఐడీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.బెంగళూరు నగర శివార్లలోని పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న సూరజ్ రేవణ్ణని బెంగళూరులోని ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఐడీ పోలీసులు హాజరుపరిచారు. ఈ సమయంలో విచారణ జరిపిన న్యాయమూర్తి ఎదుట కేసు విచారణ నిమిత్తం తమ రిమాండ్‌కు తరలించాలని అభ్యర్థించారు.

ఈ నేపథ్యంలో 8 రోజులు (జులై 1వ తేదీ వరకు) సీఐడీ పోలీసు కస్టడీకి ఇస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ శివకుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఐడీ పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు.సూరజ్ రేవణ్ణపై నమోదైన అసాధారణ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి అతన్ని పరీక్షల కోసం బౌరింగ్ ఆసుపత్రికి తరలించాలని పోలీసులు నిర్ణయించారు. మొత్తం మీద హాసన్ జిల్లా పోలీసుల చేతి నుంచి సీఐడీకి కేసు బదిలి కావడంతో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు మరింత కష్టాలు ఎదురైనాయని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+