రూ. 100 కోట్ల బ్లాక్ మనీ ? గాలి ఫ్రెండ్ శ్రీరాములు గన్ మ్యాన్ అరెస్టు

రూ. 100 కోట్ల పాత పెద్ద నోట్లు అక్రమంగా మార్పిడి చేసి కొత్త నోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బళ్లారీ పార్లమెంట్ సభ్యుడు (బీజేపీ) బి. శ్రీరాములు గన్ మ్యాన్ చెన్నబసప్ప హోసమనిని సీఐడీ

బళ్లారి: రూ. 100 కోట్ల పాత పెద్ద నోట్లు అక్రమంగా మార్పిడి చేసి కొత్త నోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో బళ్లారీ పార్లమెంట్ సభ్యుడు (బీజేపీ) బి. శ్రీరాములు గన్ మ్యాన్ చెన్నబసప్ప హోసమనిని సీఐడీ పోలీసు అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.

కర్ణాటక భూస్వాధీన ప్రత్యేక అధికారి భీమా నాయక్ కారు డ్రైవర్ రమేష్ అలియాస్ రమేష్ గౌడ ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు బీజేపీ ఎంపీ శ్రీరాములు గన్ మ్యాన్ చెన్నబసప్ప హోసమనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

బ్లాక్ మనీని వైట్ మనీగా చేసిన దందా గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కారు డ్రైవర్ రమేష్ మండ్య జిల్లా మద్దూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఆత్మహత్య చేసుకునే ముందు కారు డ్రైవర్ రమేష్ గౌడ కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఏఎస్ అధికారి భీమా నాయక్, ఆయన సొంత కారు డ్రైవర్ మహమ్మద్ తదితరుల పేర్లు డెత్ నోట్ లో రాసిపెట్టాడు.

పోలీసులు డెత్ నోట్ ను స్వాధీనం చేసుకున్న తరువాత భీమా నాయక్ కోసం గాలించారు. చివరికి సీఎం సిద్దరామయ్యకు ఆప్తుడు అయిన చించోళి శాసన సభ్యుడు ఉమేష్ జాధవ్ అల్లుడి (కులబర్గిలోని ఎస్ జీఓ కాలనీ) ఇంటిలో భీమా నాయక్ ను అరెస్టు చేశారు.

CID police today arrested BJP MP B Sriramulu's gunman Channabasavappa

భీమా నాయక్ ను అరెస్టు చేసిన సమయంలో శాసన సభ్యుడు ఉమేష్ జాధవ్ భార్య, ఆయన తల్లి అదే ఇంటిలో ఉన్నారని పోలీసులు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం రూ. 100 కోట్ల పాత నోట్లను భీమా నాయక్ సహాయంతో కొత్త నోట్లుగా మార్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదే విషయం డెత్ నోట్ లో రాసిపెట్టిన కారు డ్రైవర్ రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు భీమా నాయక్, ఆయన కారు డ్రైవర్, బళ్లారీ ఎంపీ శ్రీరాములు గన్ మ్యాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఈ కేసులో ఇంకా పలువురిని అరెస్టు చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు అంటున్నారు. శ్రీరాములు గన్ మ్యాన్ అరెస్టు కావడంతో గాలి వర్గీయులు హడలిపోతున్నారు. శ్రీరాములు గన్ మ్యాన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సీఐడీ పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+