Shootout: కేజీఎఫ్-2 సినిమా చూస్తుంటే థియేటర్ లోనే రివాల్వర్ తో కాల్చిపారేశాడు, ఫ్యాన్స్ పరుగో పరుగు !
బెంగళూరు/హావేరి: కేజీఎఫ్-2 సినిమా చూడటానికి సినీ అభిమానులు, కన్నడ హీరో యష్ ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్-2 సినిమా మంచి కలెక్షలు వసూలు చేస్తోంది. కేజీఎఫ్-2 సినిమా చూడటానికి యువకులు పోటీ పడుతున్నారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన యువకుడు ఉత్సహంగా ఈలలు వేస్తూ సినిమా చూస్తున్నాడు. ఇదే సమయంలో వెనుక సీటులో కుర్చున్న మరో యువకుడితో ఆ వ్యక్తికి చిన్న గొడవ జరిగింది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో థియేటర్ లో ఇద్దరు యువకులు గొడవపడ్డారు. తరువాత వెనుక సీటులో కుర్చున్న వ్యక్తి సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. కొంత సేపటి తరువాత మళ్లీ థియేటర్ లోకి వెళ్లిన అతను ముందు సీటులో కుర్చుని స్నేహితులతో కలిసి టెన్షన్ గా సినిమా చూస్తున్న యువకుడి మీద రివాల్వర్ తో మూడు రౌండ్ లు కాల్పులు జరిపాడు. కేజీఎఫ్-2 మాస్ సినిమా చూస్తున్న సమయంలో రియల్ గా థియేటర్ లో కాల్పులు జరపడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ప్రాణ భయంతో సినిమా థియేటర్ నుంచి బయటకు పరుగు తీశారు. థియేటర్ లో కాల్పులు జరపడంతో సినిమాను మధ్యలోనే నిలిపేశారు.

కేజీఎఫ్-2 సినిమా హవా
కేజీఎఫ్-2 సినిమా చూడటానికి సినీ అభిమానులు, కన్నడ హీరో యష్ ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. దేశవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్-2 సినిమా మంచి కలెక్షలు వసూలు చేస్తోంది. కేజీఎఫ్-2 సినిమా చూడటానికి యువకులు పోటీ పడుతున్నారు. కర్ణాటకలోని అనేక జిల్లాల్లో కేజీఎఫ్-2 సినిమా థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్లిన యువకుడు
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని శిగ్గావి పట్టణంలోని రాజశ్రీ సినిమా థియేటర్ లో మంగళవారం రాత్రి సెకండ్ షో సినిమాకు శిగ్గావి తాలుకాలోని ముగళి గ్రామంలో నివాసం ఉంటున్న వసంత్ కుమార్ శివపుర అలియాస్ వసంత్ కుమార్ (28) అనే యువకుడు వెళ్లాడు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన వసంత్ కుమార్ ఉత్సహంగా ఈలలు వేస్తూ సినిమా చూస్తున్నాడు.

సీటు మీద కాలు పెట్టాడని గొడవ
సినిమా చూస్తున్న సమయంలో వెనుక సీటులో కుర్చున్న మరో యువకుడు వసంత్ కుమార్ కుర్చున్న సీటు మీద కాలు పెట్టడంతో గొడవ జరిగింది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో థియేటర్ లో వసంత్ కుమార్, అతని స్నేహితులు, వెనుక సీటులో కుర్చున్న వ్యక్తి గొడవపడ్డారు. తరువాత వసంత్ కుమార్ వెనుక సీటులో కుర్చున్న వ్యక్తి సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్లాడు.

థియేటర్ లోనే రివాల్వర్ తో కాల్చి పారేశాడు
కొంత సేపటి తరువాత మళ్లీ రాజశ్రీ థియేటర్ లోకి వెళ్లిన అతను ముందు సీటులో కుర్చుని స్నేహితులతో కలిసి టెన్షన్ గా సినిమా చూస్తున్న వసంత్ కుమార్ మీద రివాల్వర్ తో మూడు రౌండ్ లు కాల్పులు జరిపాడు. వసంత్ కుమార్ కాలిలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. మరో బుల్లెట్ సీటుకు తగిలింది. బుల్లెట్ గాయాలు కావడంతో వసంత్ కుమార్ కుప్పకూలిపోయాడు.

థియేటర్ లో పరుగో పరుగు
కేజీఎఫ్-2 మాస్ సినిమా చూస్తున్న సమయంలో రియల్ గా సినిమా థియేటర్ లో కాల్పులు జరపడంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ప్రాణ భయంతో సినిమా థియేటర్ నుంచి బయటకు పరుగు తీశారు. థియేటర్ లో కాల్పులు జరపడంతో సినిమాను మధ్యలోనే నిలిపేశారు. వసంత్ కుమార్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి వివరాలు ఏమాత్రం తెలియడం లేదని, అతని కోసం గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications