ఉద్యోగిని చెప్పుతో కొట్టిన ఎంపీపై అశోక్ తీవ్ర ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఎయిర్ ఇండియా సిబ్బందిని శివసేన పార్లమెంటు సభ్యుడు కొట్టిన ఘటనపై పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎంపీ కండకావరం: ఎయిరిండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతోకొట్టాడు!

భౌతిక దాడులను ఏ పార్టీ ప్రోత్సహించబోదని, అలాంటివి ఎప్పుడూ జరగవని ఆయన అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీసీఏకు సూచించినట్లు అశోక్ గజపతి రాజు తెలిపారు.

Civil Aviation Minister condemns physical assault on Air India staff

బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో ఎయిర్ ఇండియా సిబ్బందిని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. మరోవైపు శివసేన పార్టీ కూడా దీనిపై స్పందించింది. గైక్వాడ్‌ అలా ప్రవర్తించడానికి గల కారణమేంటో తెలుసుకుంటామని చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Condemning the physical assault of the Air India staff who was beaten up by Shiv Sena MP Ravindra Gaikwad, Civil Aviation Minister P. Ashok Gajapathi Raju on Thursday said no political party will encourage such an act.
Please Wait while comments are loading...