దేవుడి పేరుతో రేషన్ కార్డు, తప్పు చేసిన పూజారిని రక్షించని దేవుడు

నిత్యం దేవుడిని పూజిస్తోన్న తప్పుచేసినా అతణ్ని రక్షించలేదు. దేవుడి పేరు మీదనే బాబులాల్ అనే పూజారి రేషన్ కార్డు సంపాదించాడు. ప్రతి నెలా ఈ కార్డుపై రేషన్ తీసుకొంటున్నాడు. అయితే బయోమెట్రిక్ విధానం అమలు

జైపూర్ :నిత్యం దేవుడిని పూజిస్తుంటాడు, ఆ దేవుడి పేరుతోనే రేషన్ కార్డు తీసుకొన్నాడు. ప్రతి నెల రేషన్ ను తీసుకొంటున్నాడు.ప్రతి రోజూ పూజిస్తోన్నా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని దేవుడి భావించాడేమో,తప్పు చేసిన పూజారిని దేవుడు కూడ రక్షించలేదు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

రాజస్థాన్ లోని బరన్ జిల్లా కజిఖేర్ ప్రాంతానికి చెందిన బాబులాల్ స్థానికంగా ఉన్న దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు.నిత్యం తాను పూజలు చేసే దేవుళ్ళ పేరుతో 2015 నుండి ఆయన రేషన్ తీసుకొంటున్నాడు.

civil supply officers taken in to custody a priest

శ్రీకృష్ణుడికి మరో పేరైన మురళి మనోహర్ పేరుతో రేషన్ కార్డు సంపాదించాడు, ఆయన భార్య తంకురుని జీ ,కుమారుడిగా శ్రీగణేష్ పేర్లను నమోదు చేశాడు. ఏడాది నుండి రేషన్ తీసుకొంటున్నాడు. బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకుగాను బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది పౌరసరఫరాల శాఖ,

ప్రతి నెల రేషన్ తీసుకొనేందుకు వెళ్ళినట్టుగానే శుక్రవారం నాడు రేషన్ షాపుకు వెళ్ళిన బాబులాల్ కు చక్కెదురైంది. పౌరసరఫరాల శాఖాధికారులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. ఎంత కాలం నుండి ఆయన తప్పుడు పేర్లతో రేషన్ ను పొందుతున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. దేవుడికి పూజలు చేసినా, దేవుడి పేరు పెట్టుకొన్నా చేసిన తప్పుకు మాత్రం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది బాబులాల్ కు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+