సీజేపీకి షాక్ ఇచ్చిన దిల్లీ సర్కార్.. రేపు, ఎల్లుండి సెంట్రల్ పార్క్ మూసివేత

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనాతా పార్టీ(సీజేపీ).. దేశ రాజధాని దిల్లీలోని కొన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ లో అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు 'లెహ్రా దో తిరంగా' నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీజేపీకి దిల్లీ పోలీసులు షాక్ ఇచ్చారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ పార్క్ ను శుక్రవారం, శనివారం రెండు రోజులపాటు మూసివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్నాట్ ప్లేస్ గుర్తించిన నిరసన ప్రాంతం కాదని దిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూ దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.


కొన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ అక్టబర్ 16, 17 తేదీల్లో మూసివేసి ఉంటుందని పేర్కొంది. పాలనాయంత్రాంగం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అంతకుముందు ఈ ప్రాంతంలో భారీ నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు లెహ్రా దో తిరంగా నిరసనలకు రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అలాగే పౌరులు భారీ సంఖ్యలో హాజరు కావాలంటూ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు సెంట్రల్ పార్క్ ను మూసివేయడం చర్చనీయాంశంగా మారింది. అటు దిల్లీ హైకోర్టు కూడా నిరసనలకు ఓకే చెప్పింది. ఈ మేరకు సీజేపీ కు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో దిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

CJP Delhi government shocks blow Central Park at Connaught Place to remain closed for next two days

ఇక ఇప్పటికే సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా సీజేపీ చేస్తున్న ఆందోళనలతో ఆ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. జంతర్‌ మంతర్‌ వద్ద కేవలం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకే సీజేపీ సభ్యులు అయిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను జైలులో పెట్టారని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్​ దీప్కే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిరసనకారులకు కీలక పిలుపునిచ్చారు. జాతీయ జెండాను ఎగురవేయడానికి శుక్రవారం దిల్లీలోని వ్యాపార కేంద్రమైన కొన్నాట్ ప్లేస్‌ లోని సెంట్రల్ పార్క్ వద్దకు రావాలని సూచించారు. అయితే దిల్లీకి రాలేని వారు తమ నగరాల్లో తిరంగ మార్చ్​ ను నిర్వహించి జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. అయితే ఇప్పుడు సెంట్రల్ పార్క్ రెండు రోజుల పాటు మూసివేయడంతో సీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటందనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+