RAMAYANA NEW TRAILER: 'రామాయణ' కొత్త ట్రైలర్ రిలీజ్.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీ రాముడిగా.. టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి సీతగా.. రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్'.. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రామాయణ చిత్రం రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. తొలిభాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంయుక్తంగా ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్ స్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 50 వేల స్క్రీన్లలో రిలీజ్ చేసేలా సోనీ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.

అయితే రామాయణ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదల కాగా తాజాగా దసరా కానుకగా మరో కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త ట్రైలర్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇలాంటి విజువల్స్ ఇండియన్ సినిమా తెరపై న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉన్నాయి. కొత్త ట్రైలర్ ను చాలా షార్ప్ గా కట్ చేశారు మేకర్స్. "యుగయుగాలుగా దేవాసురుల మధ్య సాగిన యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. పుడమి అంతటా శాంతి నెలకొంది. దీనస్థితిలో ఉన్న అసురుల కోసం ఎగిసినది ఒక జ్వాల. అష్టదిక్కులా మారు మ్రోగినది ఆ అసురుని నామం. రావణ.. అతని అరాచకానికి ముల్లోకాలు అతని పాదాక్రాంతం అయ్యాయి.
ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం.. అప్పుడు ధర్మ స్థాపనకు స్వయంగా విష్ణు భగవానుడే అవతరించాడు. శ్రీరాముని రూపంలో.. ఒకవేళ ఇదే నా విధిరాత అయితే ఆ ముల్లోకాల సాక్షిగా నేను అతడ్ని వధిస్తాను. ఆ లంక ఎక్కడైనా సరే అన్వేషించి కనిపెడతాను. ఇది రాముని శపథం.. అనే ఆసక్తికర మాటలతో ట్రైలర్ సాగింది. ఇక ఈ మూవీ తొలి భాగం నవంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications
