Ranabaali Twitter Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్విట్టర్ రివ్యూ ఇదే..
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రణబాలి'.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న అంటే మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా సినిమా.. సినిమాకు తనేంటో ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు విజయ్ దేవరకొండ. అయితే రణబాలి మూవీ ఆయన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన చిత్రం అని తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ విశ్వరూపం కనిపిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే విజయ్ దేవరకొండ.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో రాహుల్ దర్శకత్వంలో విజయ్ టాక్సీవాలా అనే సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాగే విజయ్ సరసన ఈ మూవీలో ఆయన సతీమణి రష్మిక నటిస్తోంది. విజయ్- రష్మికల వివాహం జరిగిన తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఫ్యాన్స్ లో రణబాలి మూవీపై ఆసక్తి నెలకొంది. గతంలో విజయ్- రష్మిక హిట్ పెయిర్ అని ముద్ర పడిన విషయం తెలిసిందే. గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాల్లో తమ నటనతో మెప్పించారు వీళ్లిద్దరు.
#Ranabaali 1st review from #ShravyaVarma !!!!❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥My man @TheDeverakonda 🤞🤞🔥🔥#Vijaydeverakonda #rashmikamandannaJust few hrs left!!❤️🔥❤️🔥❤️🔥🔥🔥🔥 https://t.co/GPQes7yb8J
— opinion (@mind_talks9) October 15, 2026
ఇక రణబాలి చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఏందయ్య సామి, కోబలి పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరో రెండు పాటలను డైరెక్ట్ గా థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. టీ-సిరీస్ సంస్థ సమర్పిస్తోంది. ఇటీవల రణబాలి మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. సెన్సార్ బోర్డు ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ 3 గంటలు ఉంది. ఇక ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు మరికొద్ది గంటల్లో మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

రణబాలి మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా కీలక పోస్టర్ ను రిలీజ్ చేసింది. యాన్ ఎపిక్ హిస్టోరికల్ ఎక్స్ పీరియన్స్ అవైట్స్ యూ.. రేపు ఈ సమయానికి మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.. రణబాలి మూవీ రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.. అని రాసుకొచ్చింది. అలాగే ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ రా అండ్ రస్టిక్ లుక్ లో ఉన్నారు. వెనకాల ఫైర్, గుర్రంతో పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. అలాగే ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ తన నటనతో విశ్వరూపం చూపించాడని.. ఆయన కెరీర్ లో ఇది ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందని ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫుల్ రివ్యూ కోసం మరికొద్ది గంటలు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications
