సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలు విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 7 రోజులు పాటు జైల్లో గడిపిన అనంతరం.. ఆ ఇద్దరి విడుదలకు దిల్లీలోని ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది. శాంతికి భంగం కలిగించే ఎలాంటి చర్యలలోనూ పాల్గొనబోమని లిఖితపూర్వకంగా హామీ పత్రం ఇచ్చాక జైలు నుంచి విడుదల అయ్యారు సీజేపీ నేతలు.
జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వబోమని భవిష్యత్తులో జరిగే నిరసనలు రాజ్యాంగ పరిధిలోనే ఉంటాయని హామీ ఇచ్చారు. ఇక అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపిన అంశంపై పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు వారం రోజుల తర్వాత సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాలు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మేరకు దిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఈ క్రమంలో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఒక్కొక్కరూ రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతోపాటు పూచీదారుల్ని కూడా సమర్పించారు. అలాగే జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వకూడదని ఆ ప్రదేశం మళ్లీ అధికారిక నిరసన స్థలంగా ప్రకటించే వరకూ అక్కడ నిరసనలకు ప్రజల్ని సమీకరించబోమని హామీ ఇచ్చారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన ప్రతి విచారణ తేదీన ఇద్దరూ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications
