గుంటూరు-కోల్ కతా, విశాఖ-సికింద్రాబాద్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

దసరా పండుగ ముగించుకుని తిరిగి వెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అలాగే దీపావళి పండుగ కూడా ఉండటంతో రైళ్లలో రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ఇవాళ రెండు మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను (special trains) ప్రకటించింది. ఈ రైళ్లు గుంటూరు-కోల్ కతా మార్గంతో పాటు విశాఖపట్నం-సికింద్రాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగించబోతున్నాయి. మొత్తం నాలుగు సర్వీసుల్ని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. వీటికి సంబంధించిన వివరాలను దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విడుదల చేశారు.

సికింద్రాబాద్ -విశాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపు ఎల్లుండి మీ కోసం..!
సికింద్రాబాద్ -విశాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపు ఎల్లుండి మీ కోసం..!

ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు గుంటూరు-కోల్‌కతా-గుంటూరు, విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ వెల్లడించింది. ఇందులో రైలు నంబర్ 07437 గుంటూరు - కోల్‌కతా ప్రత్యేక రైలును అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకూ ఆదివారాల్లో నడపబోతోంది.

special trains announced between guntur-kolkata visakhapatnam-secunderabad to meet passenger rush
విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!
విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!

అలాగే రైలు నంబర్ 07438 కోల్‌కతా - గుంటూరు ప్రత్యేక రైలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకూ సోమవారాల్లో నడపనున్నారు. అలాగే రైలు నంబర్ 08517 విశాఖపట్నం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలును అక్టోబర్ 22, 25 తేదీల్లో అంటే గురువారం, ఆదివారం నడపబోతున్నారు. చివరిగా రైలు నంబర్ 08518 సికింద్రాబాద్ - విశాఖపట్నం ప్రత్యేక రైలు అక్టోబర్ 23, 26 తేదీల్లో అంటే శుక్రవారం, సోమవారం నడపబోతున్నారు. ఈ ప్రత్యేక రైలు సర్వీసుల టికెట్ల బుకింగ్, హాల్ట్ లు, ఇతర వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ను కానీ, రైల్వే స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్లను కానీ సంప్రదించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+