జాతీయ జెండా ఎగరేస్తే అరెస్ట్ చేస్తారా? నిరంకుశ పాలనకు ఇదే పరాకాష్ట..

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఉదయమే జంతర్ మంతర్ ప్రాంగణంలోకి ప్రవేశించి జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యపై సీజేపీ కీలక నేత అభిజీత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో జాతీయ జెండాను ఎగరవేయడాన్ని తప్పుగా భావించేవారు అసలైన ద్రోహులని, ఈ అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు.

జంతర్ మంతర్‌ను నిరసన వేదిక జాబితా నుంచి తొలగిస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకున్నప్పటికీ, సీజేపీ నాయకులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్, అజింక్య షిండేలతో కూడిన బృందం రక్షణ వలయాలను దాటుకుని ప్రాంగణంలోకి ప్రవేశించింది. ఉదయమే అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

CJP Leader Abhijeet Dipke Slams Delhi Police Arrests After Activists Hoist Tricolor at Jantar Mantar

జెండా ఎగరేస్తే అరెస్ట్ చేస్తారా? సీజేపీ ఫైర్!

తమ సహచరుల అరెస్టును తీవ్రంగా ఖండించిన అభిజీత్ దీప్కే పోలీసుల చర్యపై ప్రశ్నల వర్షం కురిపించారు. "మా బృందం ఉదయమే జంతర్ మంతర్ చేరుకుని మన జాతీయ జెండాను ఎగురవేసింది. దేశంలో మువ్వన్నెల జెండాను ఎగరవేయడం ఎప్పటి నుంచి నేరమైంది? జంతర్ మంతర్ వద్ద జెండా ఎగరేస్తే చట్ట ఉల్లంఘన అని భావించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులే! అరెస్ట్ చేసిన మా బృందం సభ్యులపై కఠిన కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. సొంత దేశంలో జెండా ఎగరేసినందుకు అరెస్ట్ చేయడం ఏ రకమైన పాలన?" అని ఆయన నిలదీశారు.

Video: రెచ్చిపోయి పోలీసుల ముందే ఆడపిల్లలపై భీకర దాడి.
Video: రెచ్చిపోయి పోలీసుల ముందే ఆడపిల్లలపై భీకర దాడి.

జంతర్ మంతర్ కేవలం స్థలం కాదు.. అదొక తిరుగుబాటు ఆత్మ!

అదుపులోకి తీసుకున్న నాయకులకు చట్టపరమైన హక్కులను నిరాకరించవద్దని దీప్కే పోలీసులను హెచ్చరించారు. గతంలో తనను కూడా న్యాయవాదులతో మాట్లాడనివ్వకుండా 24 గంటల పాటు నిర్బంధించారని గుర్తుచేస్తూ, ఈసారి నిబంధనల ప్రకారం వారితో లాయర్లను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. "ప్రభుత్వం జంతర్ మంతర్‌ను తమ సొంత ఆస్తిలా భావిస్తోంది. కానీ ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు జంతర్ మంతర్ సొంతం. అణచివేతతో ఉద్యమాలను తొక్కేయలేరు. జంతర్ మంతర్ ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అదొక నిరసన స్ఫూర్తి! త్వరలోనే దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతుంది" అని స్పష్టం చేశారు.

గుర్తుంచుకోండి.. ఇప్పుడు యావత్ దేశం జంతర్ మంతరే: అభిజిత్ దిప్కే
గుర్తుంచుకోండి.. ఇప్పుడు యావత్ దేశం జంతర్ మంతరే: అభిజిత్ దిప్కే

జ్ఞానేష్ కుమార్ రాజీనామా వరకు పోరాటం ఆగేది లేదు!

సోషల్ మీడియా వేదికగా దేశ ప్రధాని, పోలీసు యంత్రాంగానికి సీజేపీ స్పష్టమైన సందేశాన్ని పంపింది. నిరసన హక్కును ఎవరూ కాలరాయలేరని, "హ్యాండ్స్ ఆఫ్ జంతర్ మంతర్" అంటూ పోస్టులు పెట్టారు. జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు ప్రతిఘటన ఆగేది లేదని, జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తూనే ఉంటామని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+