నేరుగా గదికి వెళ్లి లేడీ ప్రిన్సిపాల్‌ను తుపాకితో కాల్చి చంపాడు

న్యూఢిల్లీ: హర్యానాలోని యుమునానగర్ పాఠశాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి నేరుగా గదికి వెళ్లి కాల్పులు జరిపి ప్రిన్సిపాల్‌ను చంపేశాడు.

శనివారంనాడు ఆ ఘటన చోటు చేసుకుంది. తనను దూషించిందనే ఆగ్రహంతో విద్యార్థి ప్రిన్సిపాల్ రితు చాబ్రాపై కాల్పులు జరిపాడు. తన తండ్రిరకి ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో అతను ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.

 Class 12 Haryana student guns down principal in Yamunanagar school

నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటిండెంట్ రాజేష్ కాలియా చెప్పారు. వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ రితు చాబ్రాకు కాల్పుల్లో మూడు తూటాలు తగిలాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

నిందితుడి తండ్రి స్థిరాస్తి వ్యాపారి అని, అతనిపై కూడా కేసు నమోదు చేశామని రాజేష్ కాలియా చెప్పారు. రెండు వారాల క్రితం నిందితుడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలకు సరిగా రాకుండా చిల్లర తగాదాలకు దిగుతున్నాడనే కారణంతో ఆ చర్యలు తీసుకున్నారు.

శనివారర మధ్యాహ్నం అతను రివాల్వర్‌తో పాఠశాలకు వచ్చాడు. ప్రిన్సిపాల్‌ను కలుస్తానని చెప్పాడ. తర్వాత నేరుగా ప్రిన్సిపాల్ గదికి వెళ్లి, ఆమెపై కాల్పులు జరిపారు. సిబ్బంది అతన్ని పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+