ఫేస్‌బుక్ చాటింగ్ వద్దన్నందుకు తుపాకీతో కాల్చుకున్న 9వ తరగతి విద్యార్థి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో నిరంతరం చాటింగ్ చేయొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో నాయిని ప్రాంతంలోని పరాస్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ ద్వారా తన స్నేహితులతో చాటింగ్ చేస్తున్నాడు. గంటల తరబడి చాటింగ్ చేయడంతో తండ్రికి కోపమొచ్చింది.

గంటల తరబడి చాటింగ్ చేయొద్దని తండ్రి తన కుమారుడ్ని మందలించాడు. దీంతో క్షణికావేశానికి గురైన అతని కుమారుడు తన గదిలోకి వెళ్లి తుపాకితో కాల్చుకున్నాడు. పెద్దగా శబ్దం రావడంతో గదిలోకి వెళ్లి చూడగా కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
అతడ్ని కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ మృతుడి తండ్రిదని తెలిపారు. మృతుడి తండ్రి ఓ న్యాయవాదని తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications