వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి గూగుల్‌లో ఉద్యోగం, వేతనం రూ.12 లక్షలు

'నాలాంటి యావరేజ్ విద్యార్థికి గూగూల్‌లో ఉద్యోగం వస్తుందని ఎవరు అనుకుంటారు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఓ విధంగా నా కల నిజం అయింది.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: 'నాలాంటి యావరేజ్ విద్యార్థికి గూగూల్‌లో ఉద్యోగం వస్తుందని ఎవరు అనుకుంటారు. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఓ విధంగా నా కల నిజం అయింది. నా కష్టానికి తగిన ఫలితం దక్కింద'న్నాడు హర్షిత్ శర్మ అనే పన్నెండో తరగతి విద్యార్థి.

హర్షిత్ శర్మ గూగుల్‌లో గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. ఇతను చండీగఢ్ సెక్టార్ 33-బిలో గల ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి. పన్నెండో తరగతి చదువుతున్నాడు.

ప్రారంభంలో ఏడాది పాటు స్టయిఫాండ్ కింద అతనికి గూగుల్‌లో నెలకు రూ.4 లక్షలు వస్తాయి. ఈ సమయంలో అతను ట్రెయినీ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తాడు. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయ్యాక నెలకు రూ.12 లక్షల రెమ్యునరేషన్ ఉంటుంది.

ఆగస్ట్ 7న కాలిఫోర్నియాకు

ఆగస్ట్ 7న కాలిఫోర్నియాకు

చండీగఢ్‌కు చెందిన ఓ పత్రికతో హర్షిత్ శర్మ మాట్లాడాడు. పదేళ్ల వయస్సు నుంచే తాను డిజైనింగ్‌పై ఎలా దృష్టి పెట్టి నేర్చుకున్నానో చెప్పాడు. గూగుల్‌లో పని చేయాలనేది తన లక్ష్యమని చెప్పాడు. అందుకు తగినట్లు కష్టపడ్డానని, తన కల నిజమైందన్నాడు. ఆగస్ట్ 7వ తేదీన హర్షిత్ శర్మ కాలిఫోర్నియాకు వెళ్తాడు.

ఏ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందకుండానే

ఏ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందకుండానే

గూగుల్‌లో ఉద్యోగం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని, తాను పదేళ్ల వయస్సు నుంచే డిజైనింగ్ పైన దృష్టి పెట్టానని, తనకు తన అంకుల్ రోహిత్ శర్మ నేర్పించాడని హర్షిత్ శర్మ చెప్పాడు. ఆ తర్వాత ఇది తనకు అభిరుచిగా మారిందన్నాడు. తాను గూగుల్‌లో జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో పని చేశానని చెప్పాడు. మా అంకుల్ తనకు శిక్షణ ఇచ్చాడని, ఏ ఇనిస్టిట్యూట్‌లో తాను జాయిన్ ట్రెయిన్ కాలేదని చెప్పాడు.

అప్పుడే రూ.50 వేలు సంపాదించా

అప్పుడే రూ.50 వేలు సంపాదించా

నేను క్లాస్ XI జాయిన్ కాగానే ఐటీ స్ట్రీమ్ ఎంచుకున్నానని హర్షిత్ శర్మ చెప్పాడు. గ్రాఫిక్ డిజైనర్ కావాలని ఉందని తన తల్లిదండ్రులకు చెప్పానన్నాడు. పాఠశాలలో చదివినప్పుడే తాను బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల పోస్టర్లను తయారు చేయడం ద్వారా రూ.40 వేల నుంచి రూ.50 వేలు సంపాదించానని చెప్పాడు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో అతని ప్రతిభకుగాను పిఎంవో నుంచి రూ.7,000 గెలుచుకున్నాడు.

దరఖాస్తు చేసాడు, జాబ్ కొట్టేశాడు

దరఖాస్తు చేసాడు, జాబ్ కొట్టేశాడు

గత ఏడాది డిసెంబర్ నెలలో హర్షిత్ శర్మ గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అతని అద్భుత డిజైన్ల కారణంగా సెలక్ట్ అయ్యాడు. అతనికి జూన్ నెలలో అపాయింటుమెంట్ లెటర్ పంపించింది. హర్షిత్ గూగుల్ ఉద్యోగానికి సెలక్ట్ అయినందుకు ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ ఇందిరా బేనీవాల్ అన్నారు.

English summary
“WHO KNEW that an average student like me will get a job in Google. I can’t share my happiness how I am feeling, it’s like a dream has come true. My hard work has paid off well,” says Harshit Sharma, a student of Class-XII (I.T.) stream of Government Model Senior Secondary School, Sector 33-B, Chandigarh, who got selected for graphic designing by Google.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X