Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోడీకి జై కొట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్: ఒక్క రోజు గ్యాప్, కమల్ హాసన్ కు ఝలక్ !

రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అయోమయంలో కొంత కాలంగా మౌనంగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి జై అన్నారు.

చెన్నై: రాజకీయాల్లోకి రావాలా ? వద్దా ? అని అయోమయంలో కొంత కాలంగా మౌనంగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి జై అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ కు రజనీకాంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

భారతప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ అనే సేవా కార్యక్రమానికి మాత్రమే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించలేదని, దాని వెనుక మరి కొన్ని కారణాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Cleanliness is godliness Rajinikanth post twitter page

శుక్రవారం రజనీకాంత్ తన ట్వీట్టర్ పేజ్ లో ఓ పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీగారు చేపట్టిన స్వచ్చతాహీ సేవా మిషన్ కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దేశ శుభ్రతే దైవ భక్తి అంటూ ట్వీట్ చేశారు. తన అభిమానులు స్వచ్చతాహీ సేవా మిషన్ లో పాల్గొనాలని రజనీకాంత్ తన అభిమాన సంఘాలకు పిలుపునిచ్చారు.

గురువారం తాను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్ అవినీతికి, మతోన్మాధ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని గట్టిగా చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉంటున్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కమల్ హాసన్ భేటీ అవుతున్నారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన సమయంలో తాను కాషాయ రంగు పార్టీ వాడిని కాదని కమల్ హాసన్ చెప్పారు. మోడీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కమల్ హాసన్ కలిసిన మరుసటి రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోడీకి మద్దతు తెలిపి కమల్ హాసన్ కు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+