దయ్యం వదిలిస్తానని వివాహితపై రేప్, ఆమె ఏం చేసిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: దయ్యాన్ని వదిలిస్తామనే పేరుతో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి ముంబై కోర్టు పదేళ్ళ పాటు జైలు శిక్షను విధించింది. ముంబైకు చెందిన ఓ మహిళ మరో మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొంది. అయితే కొంతకాలం తర్వాత విడిపోయింది. దయ్యం పట్టిందనే ఆమెకు నయం చేస్తామని నమ్మించి బాధితురాలిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

భర్తతో కొంత కాలం పాటు కాపురం చేసిన తర్వాత ఆర్ధిక కారణాలతో ఆ వివాహిత తిరిగి తన ఇంటికి చేరుకొంది. అయితే బాధిత మహిళ కుటుంబసభ్యులకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ వ్యక్తి తరచూ బాధిత మహిళ ఇంటికి వచ్చేవాడు.

అయితే వివాహితను ఇంట్లో చూసిన ఆ వ్యక్తి ఆమెకు దయ్యం పట్టిందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. కొంత కాలంపాటు వివాహిత కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. ఆ తర్వాత పూజలు చేస్తే అంతా సర్దుకుంటుందని బాధితురాలి కుటుంబసభ్యులను నమ్మించాడు.

Cleric gets jail for black magic, raping 25-year-old woman in Mumbai

అయితే దయ్యాన్ని వదిలించేందుకుగాను ఆ వ్యక్తిని వివాహిత కుటుంబసభ్యులు పిలిపించారు. పూజ పేరుతో కుటుంబసభ్యులను ఆ వ్యక్తి బయటకు పంపారు.బాధితురాలిని గదిలోకి తీసుకెళ్ళాడు.

గ్లాసులో కొన్ని నీళ్ళు తీసుకురమ్మని బాధితురాలికి చెప్పాడు. ఆ గ్లాసు నీటిలో కొన్ని మాత్రలు వేసి తాగమన్నాడు. ఆ తర్వాత కొన్ని కాగితాలను కాల్చి బూడిదను బాధితురాలి నుదుటిపై పూశఆడు. పూజలు చేస్తున్నట్టు ఆమెను నమ్మించాడు.

కొంత సేపటి తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయింది. ఆ సమయం కోసం ఎదురు చూసిన నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందనే విషయం తెలుసుకొంది.

దీంతో బాధితురాలు కుటుంబసభ్యులకు అసలు విషయం తెలిపింది.బాధితురాలితో కలిసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. పదేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The sessions court convicted a cleric for performing black magic on a 25-year-old woman on the pretext of doing ‘pooja’ and subsequently, sexually abusing her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి