అంతా మీ వల్లే!: మోడీకి బరాక్ ఒబామా ధన్యవాదాలు
న్యూఢిల్లీ: ఫ్రాన్సులోని ప్యారిస్ వాతావరణ సదస్సులో భారత్ కీలక పాత్రపోషించిందంటూ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ సదస్సు విజయవంతం కావడంలో మోడీ పాత్ర ఉందని ప్రశంసించారు.
కాప్ 21విజయవంతం అయ్యేందుకు తన నాయకత్వంతో సానుకూల పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షులు ఒబామా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ప్యారిస్ వాతావరణ మార్పుల సదస్సు చారిత్రక విజయం సాధించడంలో భారత్ కీలకంగా వ్యవహరించిందని ఒబామా చెప్పారని పేర్కొంది. ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా హెచ్1బీ, ఎల్1 వీసాల విషయంలో అమెరికా కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లు గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారని తెలిపింది.












Click it and Unblock the Notifications