తలనొప్పిగా మారిన ఈ మెయిల్: అమితాబ్ గురించి అడిగిన హిల్లరీ

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ కలకలం రేపాయి. నిన్నటి దాకా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్న హిల్లరీ.. ఈమెయిల్స్ వ్యవహారం వెలుగు చూడటంతో ఒక్కసారిగా కాస్త వెనుకపడింది. అయినప్పటికీ ట్రంప్ కంటే లీడ్‌లోనే ఉంది.

ఇది ఇలా ఉండగా, ఆమె ఈ మెయిల్స్ వ్యవహారం కలకలం రేపాయి. ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ గురించి తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తిని ఈ మెయిల్‌లో అడినట్లు వెల్లడైనట్లుగా తెలుస్తోంది.

hillary clinton

జులై 2011లో హిల్లరీ పాకిస్థాన్‌ సంతతికి చెందిన హుమా అబేదిన్‌కు ఈ మెయిల్‌ పంపారు. కొన్నేళ్ల క్రితం మనం కలిసిన ఓ ప్రముఖ భారతీయ నటుడి పేరు ఏమిటని హిల్లరీ అందులో అడిగారు. దీనికి అమితాబ్‌ బచ్చన్‌ అని హుమా సమాధానం ఇచ్చారు.

అయితే బిగ్‌బి గురించి హిల్లరీ ఎందుకు అడిగారు, ఏ సందర్భంలో అడిగారు అనే విషయాలు ఆ ఈ మెయిల్‌లో లేవు. ఈ ఈమెయిల్‌కు సంబంధించిన ఓ ఫొటోను వాషింగ్టన్ పోస్ట్‌ పొలిటికల్‌ రిపోర్టర్‌ జోస్‌ ఏ డెల్‌రీల్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+