బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు, గాలి ముఖ్య అనుచరుడి హత్య: పట్టపగలు వెంటాడి నరికేశారు !

బీజేపీ ఎంపీ శ్రీరాములు (బళ్లారి) ముఖ్య అనుచరుడు బండి రమేష్ దారుణ హత్యకు గురైనాడు. పట్టపగలు డాబాలో రమేష్ ను ప్రత్యర్థులు అతిదారుణంగా హత్య చేసి తప్పించుకుని పారిపోయారు.

బళ్లారి/బెంగళూరు: బీజేపీ ఎంపీ శ్రీరాములు (బళ్లారి) ముఖ్య అనుచరుడు బండి రమేష్ దారుణ హత్యకు గురైనాడు. పట్టపగలు డాబాలో రమేష్ ను ప్రత్యర్థులు అతిదారుణంగా హత్య చేసి తప్పించుకుని పారిపోయారు. బండి రమేష్ హత్యతో బళ్లారి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బళ్లారి నగర శివార్లలోని గుగ్గర పట్టి ప్రాంతంలోని డాబాలో గురువారం మద్యాహ్నం బండి రమేష్ ఉన్నాడు. ఆ సందర్బంలో ప్రత్యర్థులు వేటకోడవళ్లతో బండి రమేష్ మీద విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న బండి రమేష్ ను వెంటాడి అతి దారుణంగా నరికి చంపేశారు.

Close aid of Ballari MP and BJP leader B. Sriramulu, Bandi Ramesh murdered in Ballari.

బీజేపీ బళ్లారీ నగర ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షుడిగా ఉన్న బండి రమేష్, బీజేపీ ఎంపీ శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన బండి రమేష్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు. పాతకక్షల కారణంగా బండి రమేష్ హత్యకు గురైనాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగ బళ్లారి గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+