కొడలు, మనుమరాలి హత్య...... మామకు యావజ్జీవ శిక్ష
బెంగళూరు: కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని కసి, నగదు వ్యవహారంలో తనకు సహకరించడం లేదని సహనం కొల్పోయి కొడలు, మనుమరాలిని హత్య చేసిన బట్టల వ్యాపారికి బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తు తీర్పు చెప్పింది. తమిళనాడుకు చెందిన నాగరాజన్ అలియాస్ నాగ (50) అనే వ్యక్తి ఇద్దరిని దారుణంగా హత్య చేశాడని రుజువు అయ్యిందని న్యాయస్థానం చెప్పింది.
గురువారం బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ న్యాయ స్థానం న్యాయమూర్తి సదానంద కలాల్ నిందితుడు నాగరాజన్ కు యావజ్జీవ కారాగార శిక్ష, బంగారు నగలు లూటీ చేసినందుకు మరొ ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. ఐదు వేలు జరిమానా విదిస్తున్నామని తీర్పు చెప్పారు.
వివరాలు.................!
నాగరాజన్ తమిళనాడులో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని కుమారుడు రాజకణ్ణన్ మధురైలో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలో సాటి విద్యార్థిని విజయలక్ష్మితో రాజకణ్ణన్ కు పరిచయం ఎర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. విజయలక్ష్మి తక్కువ కులానికి చెందినదని నాగరాజన్ పెళ్లికి నిరాకరించాడు. తాను విజయలక్ష్మిని వివాహం చేసుకుంటానని రాజకణ్ణన్ పట్టుబట్టాడు.

పెద్దలు నిరాకరించడంతో 2010వ సంవత్సరం పెద్దలను ఎదిరించి రాజకణ్ణన్, విజయలక్ష్మి వివాహం చేసుకున్నారు. తరువాత ఇద్దరు బెంగళూరు చేరుకుని వర్తూరు సమీపంలో కాపురం పెట్టారు. రాజకణ్ణన్ ఐటీపీఎల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు.
తమిళనాడులో ఉన్న నాగరాజన్ అప్పుడప్పుడు కుమారుడు రాజకణ్ణన్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. రాజకణ్ణన్, విజయలక్ష్మిలకు నీనా (3 నెలలు) అనే కుమార్తె ఉంది. నాగరాజన్ కు వ్యాపారంలో నష్టం రావడంతో నగదు ఇవ్వాలని కుమారుడిని వేదించేవాడు. నగదు ఇవ్వడానికి కొడలు విజయలక్ష్మి అభ్యంతరం చెప్పేది. ఈ విషయంపై నాగరాజు కొడలి మీద కక్ష పెంచుకున్నాడు.
2011 ఆగస్టు 2వ తేదిన నాగరాజన్ బెంగళూరులోని కొడుకు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజకణ్ణన్ ఉద్యోగానికి వెళ్లాడు. ఇంటిలో కొడలు, మనుమరాలు ఉన్నారు. నగదు, బంగారు నగలు ఇవ్వాలని నాగరాజ్ కొడలు విజయలక్ష్మికి చెప్పాడు. ఆమె నిరాకరించడంతో సమీపంలో ఉన్న ల్యాప్ టాప్ తీసుకుని కొడలి తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.
తరువాత కిరోసిన్ తీసుకుని కొడలు, మూడు నెలల మనుమరాలి మీద పోసి నిప్పంటించాడు. బీరువాలో ఉన్న 150 గ్రాముల బంగారు నగలు లూటి చేసి పరారైనాడు. కేసు నమోదు చేసిన వర్తూరు పోలీసులు మంబాయిలో తలదాచుకున్న నాగరాజన్ ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications