కర్ణాటక సీఎం ఎంపికలో డీకే కొత్త ట్విస్టు - నేటి సాయంత్రమే ముహూర్తం..!!

కర్ణాటక రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టినా.. ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం డైలమా కొనసాగుతోంది. సిద్దరామయ్య వర్సస్ డీకే శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం అయింది. సిద్దరామయ్య ను సీఎంగా ఖరారు చేసారంటూ ప్రచారం సాగింది. పార్టీ ఖండించింది. డీకే శివకుమార పార్టీకి విధేయుడిగా ఉంటూనే హైకమాండ్ ను టెన్షన్ పెడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రి బెంగళూరు సీఎల్పీ సమావేశం జరగనుంది.

నేడు సీఎల్పీ సమావేశం:కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎపిసోడ్ కు ఈ రోజు తెర పడే అవకాశం కనిపిస్తోంది. గత శనివారం కర్ణాటక ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదివారం బెంగళూరులోని ఒక హోటల్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎం ఎంపిక పైన మొదలైన కసరత్తు ఇప్పటి వరకు తేలలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వరుస సమావేశాలు నిర్వహించింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే తన సొంత రాష్ట్రంలో వ్యవహారం కొలిక్కి తెచ్చేందుకు అటు సిద్దరామయ్య..ఇటు డీకే తో వరుసగా మంతనాలు జరిపారు. అటు రాహుల్ గాంధీతో సీఎం సీటు కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. సిద్దరామయ్యకు సీఎం పదవి.. డీకే శికుమార్ కు డిప్యూటీ ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం. కానీ, దీనిని పార్టీ ఖండించింది.

CLP meeting has been Called in Bengaluru

డీకే శివకుమార్ కొత్త ప్రతిపాదన:వచ్చే 72 గంటల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ డీకే శికుమార్ ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేఖ రాసారు. ఈ సమావేశంలో అధికారికంగా కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఎంపిక చేసే అవకాశం ఉంది. సిద్దరామయ్య వద్ద డిప్యూటీగా పని చేసేందుకు శివకుమార్ సిద్దంగా లేరు. ఇస్తే తనకు సీఎం పదవి ఇవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యేగానే కొనసాగుతానని డీకే ఇప్పటికే స్పష్టం చేసారు. సిద్దరామయ్యకు ఇవ్వటం పైన మాత్రం అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో డీకే కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.

20న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం:తనకు సీఎం పదవి ఇవ్వకుంటే మల్లిఖార్జున ఖర్గేను కర్ణాటక ముఖ్యమంత్రి చేయాలని డీకే ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ వద్ద ఈ ప్రతిపాదన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ రోజు జరిగే సమావేశం లో డీకే శివకుమార్ పార్టీ ఎమ్మెల్యేలతో ఏం చెప్పబోతున్నారు..హైకమాండ్ సూచించిన విధంగా సిద్దరామయ్యకు మద్దతు లభిస్తుందా..లేక కొత్త పేరు తెరపైకి వస్తుందా అనేది ఉత్కంఠను పెంచుతోంది. ఈ సాయంత్రం సీఎల్పీలో నిర్ణయం...ఈ నెల 20న కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది. దీంతో, ఈ రోజు సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశం తరువాత పార్టీ అధికారికంగా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+