కర్ణాటక సీఎం ఎవరంటే?: ఆయనకే ఆ బాధ్యతను వదిలేసిన సీఎల్పీ

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై తేల్చేందుకు మాత్రం కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. ఆదివారం సాయంత్రం బెంగళూరులోని ఓ హోటల్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్దరామయ్య, తదితర కీలక నేతలతో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటక తదుపరి సీఎంను ఎంపిక చేసే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకే వదిలేయాలని సీఎల్‌పీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. సమావేశానికి ముందు, సీఎల్పీ తన నివేదికను పార్టీ హైకమాండ్‌కు పంపుతుందని, ఇది తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి పేరును నిర్ణయించడానికి సమయం తీసుకుంటుందని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు.

CLP Unanimously Decided To Leave Selection Of Its Leader

కాగా, కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరనేది తేల్చేందుకు సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మల్లిఖార్జున్ ఖర్గేకే ఈ విషయంపై తేల్చేందుకు బాధ్యతలు అప్పగించింది సీఎల్పీ. మరోవైపు, సీఎల్పీ సమావేశం జరుగుతున్న హోటల్ ముందు ఇటు డీకే శివకుమార్, అటు సిద్దరామయ్య మద్దతుదారులు భారీగా చేరుకుని వారికి మద్దతుగా నినాదాలు చేశారు.

శనివారం వెలువడిన ఫలితాల్లో కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాల్లో కాంగ్రెస్ 135 కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు గెలుచుకుంది. జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం జరిగింది. మరోవైపు, మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి, కేబినెట్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+