కేజ్రీవాల్ రాజీనామాకు ముహూర్తం: వాట్ నెక్స్ట్?

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- రాజీనామాకు పూనుకున్నారు. తన పదవిని త్యజించనున్నారు. ప్రజా తీర్పునకు కోరనున్నారు. కొత్తగా ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికోసం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 4:30 అపాయింట్ లభించింది. లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఇద్దరు లేదా ముగ్గురు మంత్రివర్గ సహచరులు ఉంటారు.

CM Arvind Kejriwal set to resign from the post today

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఈ కేసులో అరెస్ట్ సైతం అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఆయనకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అక్రమంగా ఈ కేసులు బనాయించిందనేది కేజ్రీవాల్ వాదన. తాను నిర్దోషినంటూ ముందు నుంచీ చెబుతూ వస్తోన్నారు. తాను నిర్దోషిని కావడం వల్లే సుప్రీంకోర్టు సైతం బెయిల్ మంజూరు చేసిందని చెబుతోన్నారు.

ఈ క్రమంలో ఇక ప్రజాక్షేత్రంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఈ కారణంతోనే అసెంబ్లీని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్తామనీ ప్రకటించారు.

ఈ పరిణామాల మధ్య సోమవారమే లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్ కోరారు. ఈ సాయంత్రం 4:30కు అపాయింట్ లభించింది. ఆయనను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు కేజ్రీవాల్. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఈ రాత్రికి లేదా బుధవారం ఖరారవుతుందని తెలుస్తోంది.

కేజ్రీవాల్ వారసురాలిగా మంత్రి ఆతిషికే అధిక అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ పేర్లు సైతం వినిపిస్తోన్నాయి. వీరిలో ఎవరు ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి అవుతారనేది ఈ రాత్రికి లేదా బుధవారం సాయంత్రానికి తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+