బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ సీరియస్ వార్నింగ్..!!

బెంగళూరులోని ఐటీ, వివిధ ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో తీవ్ర వివక్ష జరుగుతోందనే ఆరోపణలు కన్నడ నాట చర్చనీయాంశమౌతోన్నాయి. స్థానికులను ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నారనే ఫిర్యాదులను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఐటీ, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలకు హెచ్చరికలు సైతం జారీ చేశారు.

కన్నడిగుల ప్రయోజనాలు, వారి హక్కులను దెబ్బతీసేలా ఏ ప్రైవేటు సంస్థ వ్యవహరించినా చట్టపరమైన తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక గడ్డపై కన్నడిగుల ప్రయోజనాలే అత్యున్నతమైనవని, స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనబెట్టడం ఎంతమాత్రం తగదని ఆయన తేల్చి చెప్పారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియల్లో స్థానిక అభ్యర్థులను తిరస్కరిస్తున్నారంటూ ఇటీవల వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని డీకే శివకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.

CM DK Shivakumar Warns IT Firms as Action If Kannadigas Are Sidelined in Hiring for any reason

ఇటీవల సోషల్ మీడియాలో కర్ణాటకకు చెందిన ఓ యువతి పంచుకున్న వీడియో దీనికి ప్రధాన కారణం. బెంగళూరులోని ఐటీ సంస్థలు తమ నియామక ప్రక్రియల్లో అనుసరిస్తున్న తీరు, స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ వీడియో ద్వారా ఆమె వెల్లడించింది. ఇది వైరల్ అయింది. ఈ అంశం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్నడ సంఘాలు, స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్
బెంగళూరు- అమరావతి వందే భారత్ పై కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన: కుప్పంలో ఈ రైళ్లకు హాల్ట్

ఉద్యోగార్థులు తమ రెజ్యూమ్‌లలో లేదా బయోడేటాలో మాతృభాషగా కన్నడ అని పేర్కొంటే, ఆ దరఖాస్తులను తిరస్కరిస్తోన్నారని ఆ యువతి ఆరోపించారు. బెంగళూరులోని స్థానిక ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తక్కువ వేతనాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అర్హత కలిగిన కన్నడిగులకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం, కన్నడ పరిరక్షణ సంఘాలు జోక్యం చేసుకోవాలని కోరారు.

టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ

ఈ పరిణామాలపై డీకే శివకుమార్ స్పందించారు. కన్నడిగుల హక్కులు, స్వాభిమానం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత టెక్ క్యాపిటల్ గా బెంగళూరు ప్రసిద్ధి చెందిందంటే, దానికి కారణం.. ఇక్కడి భూమి, మౌలిక సదుపాయాలు, స్థానిక యువత కష్టం, నైపుణ్యాలే మూలకారణమని గుర్తుచేశారు. స్థానిక యువత ప్రతిభపై తమకు పూర్తి నమ్మకం ఉందని, వారిని చులకనగా చూడటానికి వీల్లేదని పేర్కొన్నారు.

వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు
వైభవ్ సూర్యవంశీ ఫ్లాప్ షో: టీమిండియా మాజీ ప్లేయర్ లేవనెత్తిన ప్రశ్నలు

మాతృభాష లేదా ప్రాంతం ఆధారంగా ఐటీ, ఇతర ప్రైవేటు సంస్థలు అభ్యర్థుల పట్ల పక్షపాతం చూపడం తీవ్రమైన విషయమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఏ కంపెనీ అయినా ఉద్దేశపూర్వకంగా స్థానిక కన్నడిగులను పక్కనబెట్టినట్లు నిరూపితమైతే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+