Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళల ఖాతాల్లో రూ.5,000 డబ్బులు పడ్డాయ్: త్రిబుల్ బొనాంజా

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మహిళలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. త్రిబుల్ బొనాంజా ప్రకటించారు. కలైజ్ఞార్ మగళిర్ ఉరిమై థొగై పథకం కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఇది- ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన మొత్తం. నెలకు 1,000 చొప్పున 3,000 రూపాయలతో పాటు అదనంగా ప్రత్యేక వేసవి సహాయం కింద మరో 2,000లు కూడా జమ చేశారు.

ఈ విషయాన్ని స్టాలిన్ స్వయంగా వెల్లడించారు. తన సోషల్ మీడియాలో మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, ద్రవిడ 2.0 పాలనలో కలైజ్ఞార్ మగళిర్ ఉరిమై థొగై పథకం కింద నెలవారీ హక్కుల గ్రాంట్‌ను రూ. 1,000 నుండి రూ. 2,000 లకు పెంచుతామని వెల్లడించారు. మహిళల మద్దతుతో తాము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2023 సెప్టెంబర్‌లో ప్రారంభమైన పథకం ఇది. మాజీ ముఖ్యమంత్రి కలైజ్ఞార్ కరుణానిధి పేరుతో దీన్ని అమలులోకి వచ్చింది.

CM MK Stalin gave a huge surprise bonanza for women crediting a sum of 5000 each into bank accounts

వారికి ఆర్థిక సాయంతో పాటు సమాజంలో మహిళలు చేస్తున్న కృషికి లభించిన గుర్తింపుగా స్టాలిన్ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఓ వీడియో క్లిప్పింగ్ ను విడుదల చేశారు. ఈ 5,000 రూపాయల మొత్తం మహిళలకు వారి రోజువారీ ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల విద్యా ఖర్చులను చూసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ఈ నెలవారీ సహాయాన్ని మూడు నెలల పాటు నిలిపివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికలను సాకుగా చూపుతూ అడ్డుకుంటోన్నారని స్టాలిన్ ఆరోపించారు.

ఢిల్లీలోని ఓ పార్టీ, దానికి దాసోహమైన తమిళనాడులోని మరో పార్టీ ఈ కుట్రను పన్నుతున్నాయని స్టాలిన్ విమర్శించారు. తమిళనాడు మహిళలకు ఇచ్చిన హామీని ఎవరు, ఎన్ని అడ్డంకులను సృష్టించినా ఆగబోదని, తాను వెనకడుగు వేయబోనని చెప్పారు. డబ్బుల విడుదలను ఆపడానికి కొందరు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందని అన్నారు. కుటుంబంలోని వ్యక్తిగా, మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని నిలిపివేస్తేఎంత కష్టాలను ఎదుర్కొంటారో తెలుసునని వ్యాఖ్యానించారు.

అందుకే ముందుగానే ఈ మొత్తాన్ని విడుదల చేశానని స్టాలిన్ వివరించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలవారీ 1,000 రూపాయల మొత్తానికి ప్రత్యేక వేసవి సహాయం కింద 2,000 రూపాయలను కలిపి మొత్తం 5,000 రూపాయలను 1.31 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశానని, ఈ మొత్తం రాబోయే మూడు నెలలకు సరిపోతుందని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+