వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీపా, పన్నీర్ సెల్వం వర్గీయుల భేటీ: పక్కా ప్లాన్, రాష్ట్ర పర్యటన

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు బుధవారం చెన్నైలోని టీ. నగర్ లోని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇంటికి వెళ్లి చర్చించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు బుధవారం చెన్నైలోని టీ. నగర్ లోని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఇంటికి వెళ్లి చర్చించారు. శశికళపై తిరుగుబాటు చేసిన సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలని దీపాకు మనవి చేశారు.

పన్నీర్ సెల్వం బహిష్కరణ: పార్టీ పదవి నుంచి ఔట్, సంబరాలుపన్నీర్ సెల్వం బహిష్కరణ: పార్టీ పదవి నుంచి ఔట్, సంబరాలు

తాను తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఎవరు సీఎంగా ఉండాలో అభిప్రాయాలు తెలుసుకుంటానని ఇప్పటికే పన్నీర్ సెల్వం ప్రకటించారు. పన్నీర్ సెల్వంతో పాటు దీపా కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి శశికళ కుట్రలు, కుళ్లు రాజకీయాల గురించి ప్రజలకు వివరాలించాలని రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.

CM O.Paneerselvam calls J.Deepa to work together.

జయలలిత మరణించిన తరువాత ఆమె మేనకోడలు దీపా బహిరంగంగా మీడియా ముందు శశికళ మీద దుమ్మెత్తి పోసిన విషయం తెలిసిందే. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు దీపా పేరవై సంస్థను స్థాపించి దీపాకు మద్దతు ఇచ్చారు.

ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు: నేనే సీఎం, శశికళఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు: నేనే సీఎం, శశికళ

ఫిబ్రవరి 24వ తేది జయలలిత జయంతి సందర్బంగా తాను కొత్త పార్టీ పెడుతున్నానని ఇప్పటికే దీపా ప్రకటించారు. దీపా పేరవై సంస్థ కార్యక్రమాలను శశికళ అనుచరులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ఈ సమయంలో శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం వర్గీయులు దీపాను కలిసి మద్దతు కోరారు.

జయలలితకు అత్యంత సన్నిహితుడైన పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చెయ్యడంతో దీపా కూడా ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారని దీపా పేరవై సంస్థ నాయకులు చెప్పారు. మీడియా ముందు తాను పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్నానని దీపా ప్రకటిస్తారని దీపా పేరవై సంస్థ నాయకులు కచ్చితంగా చెబుతున్నారు.

English summary
Tamil Nadu Chief Minister O.Paneerselvam calls J.Deepa Jayakumar to work together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X