కొచ్చిలో రూ.600 కోట్లకు పైగా పెట్టుబడితో అదానీ లాజిస్టిక్స్ పార్క్..!
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) కొచ్చిలో కొత్త లాజిస్టిక్స్ పార్క్ ప్రారంభించింది. కలమస్సేరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కేరళను లాజిస్టిక్స్ & పారిశ్రామిక కేంద్రంగా మారుస్తుందని భావిస్తున్నారు.
ఉద్యోగాలు & పెట్టుబడులు..
దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్క్‌లో రూ. 600 కోట్లకు పైగా పెట్టుబడులు జరిగినట్టు తెలుస్తోంది. దీని ద్వారా 1,500 మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని అంటున్నారు. అలాగే, ఈ-కామర్స్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మాస్యూటికల్స్, ఆటోమోటివ్, రిటైల్ రంగాల్లో ఎగుమతి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక సౌకర్యాలు & డిజిటల్ ఇంటిగ్రేషన్..
ఈ లాజిస్టిక్స్ పార్క్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, స్మార్ట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. గేట్ ఎంట్రీ నుంచి ఇన్వాయిస్ వరకు అన్ని ఆపరేషన్లు డిజిటల్‌గా నిర్వహించబడతాయి. ఇది కస్టమర్ కి సౌలభ్యం, పారదర్శకత సహా పలు అంశాలను నిర్ధారిస్తుందని చెబుతున్నారు.
ఇక ఈ మేరకు APSEZ డైరెక్టర్ & CEO అశ్వనీ గుప్తా మాట్లాడుతూ.. కలమస్సేరి లాజిస్టిక్స్ పార్క్ APSEZకు ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని తెలిపారు.
అలానే మంత్రి రాజీవ్ మాట్లాడుతూ.. కలమస్సేరి లాజిస్టిక్స్ పార్క్ APSEZ విజన్‌ను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇది వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా మార్కెట్లను కలుపుతుందని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తు లక్ష్యాలు..
- స్థానిక ఉపాధి, నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వ్యాపార అవకాశాలు
- దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ బలోపేతం
- సుస్థిర, ఆధునిక, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణం












Click it and Unblock the Notifications