షాక్: మరాఠి రాదు సారి, సీఎం సిద్దూ, కన్నడిగులకు అవమానం, పార్ట్ టైం ప్రేమ: ఎంపీ!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి మరాఠి బాష మీద ప్రేమ చూపిస్తున్నారని, మరాఠి రాదు సారి అంటున్నారని, కన్నడ బాషను, కన్నడిగులను అవమానపరిచారని, కన్నడ బాష మీద పార్ట్ టైం ప్రేమ చూపిస్తున్నారని మైసూరు-మడికేరి లోక్ సభ సభ్యుడు ప్రతాప్ సింహా మండిపడ్డారు. సీఎం సిద్దరామయ్య వెంటనే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని మైసూరులో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా డిమాండ్ చేశారు.

సీఎంకు కన్నడ రాదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కన్నడ బాష రాదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రణాళిక, ప్రనాళిక అనే పదాలకు వ్యత్యాసం తెలీదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.

మరాఠీ బాష మీద ప్రేమ
కర్ణాటక ముఖ్యమంత్రి బెళగావిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి మరాఠి బాష మీద ప్రేమ చూపించి కన్నడిగులను తీవ్రస్థాయిలో అవమానించారని, వెంటనే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా డిమాండ్ చేశారు.

పార్ట్ టైం కన్నడ
సీఎం సిద్దరామయ్య పార్ట్ టైంగా కన్నడ మీద ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు. కర్ణాటకలో పుట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు మరాఠి రాదు క్షమించండి అంటూ బహిరంగ సభలో సిద్దరామయ్య మరాఠీలకు ఎందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రశ్నించారు.

మరాఠీల మీద ప్రేమ
సీఎం సిద్దరామయ్యకు కన్నడ మీద ఎలాంటి ప్రేమ లేదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. కన్నడ బాష మీద ప్రేమ ఉంటే బెళగావిలో మరాఠీలకు ఎందుకు క్షమాపణ చెప్పాలి, కర్ణాటకలో ఉంటున్న వారికి కన్నడ బాష వస్తోందని సీఎం సిద్దరామయ్యకు తెలీదా అని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రశ్నించారు.

సీఎంకు కన్నడిగుల దెబ్బ
మరాఠీ బాషను నెత్తిన పెట్టుకుని కన్నడ బాషను కించపరిచిన సీఎం సిద్దరామయ్యకు, కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు తగిన బుద్దిచెబుతారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా హెచ్చరించారు. సీఎం సిద్దరామయ్య దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్లే సమయం దగ్గరల్లోనే ఉందని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా జోస్యం చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications