ప్రభుత్వం వారి సంక్రాంతి కానుక: 10వ తేదీన వారి ఖాతాల్లో రూ.1,000 జమ: గిఫ్ట్ హ్యాంపర్లు
Sankranthi 2024: ఇంకొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. ఇప్పటి నుంచే ఆ సందడి కనిపిస్తోంది. మార్కెట్లల్లో పండగ కోలాహలం నెలకొంది. విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అన్ని రకాల పువ్వుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు కూడా ప్రత్యేక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేస్తోన్నాయి. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ 4,500 ప్రత్యేక స్పెషల్ సర్వీసులను నడిపిస్తామని వెల్లడించింది. అటు దక్షిణ మధ్య రైల్వే కూడా వివిధ నగరాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానుంది.

ఈ పరిస్థితుల్లో సంక్రాంతి కానుకను ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. బియ్యం కార్డు ఉన్న కుటుంబాలందరికీ వర్తింపజేసేలా కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ గిఫ్ట్ హ్యాంపర్లను అందించనుంది. దీనితో పాటు 1,000 రూపాయల నగదును వారి ఖాతాల్లోకి జమ చేయనుంది.
ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో పొంగల్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల వారికి ఎలాంటి లోటు రానివ్వకుండా పండగ ఖర్చుగా 1,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తామని అన్నారు.
అలాగే- గిఫ్ట్ హ్యాంపర్లను పంపిణీ చేస్తామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. 10వ తేదీన వారి ఖాతాల్లో వెయ్యి రూపాయల నగదు జమ అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి 10 లక్షల మంది మహిళలకు లబ్ది కలుగుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications