సీఎం వీడీ సతీషన్ సింప్లిసిటీకి ఫిదా

కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్ కు చెందిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన చూపిన నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యమంత్రి అయివుండీ.. ఓ బహిరంగ కార్యక్రమంలో తన వద్దకు వచ్చిన సెల్యూట్ చేసిన ఓ ఎన్‌సీసీ క్యాడెట్ కు సీటులో నుంచి లేచి నిల్చొని గౌరవంగా సెల్యూట్ చేయడం కట్టి పడేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ సభల్లో ప్రజా ప్రతినిధులకు అధికారులు గౌరవ వందనం సమర్పించడం అనేది ప్రోటోకాల్‌గా వస్తోంది. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు తమ సీట్లలో కూర్చునే ఆ గౌరవాన్ని స్వీకరిస్తుంటారు. సతీషన్ మాత్రం ప్రోటోకాల్‌కే పరిమితం కాకుండా ఆ ఎన్‌సీసీ క్యాడెట్ కు స్వయంగా లేచి నిలబడి మర్యాద ఇవ్వడం ద్వారా తన సంస్కారాన్ని, మానవీయ దృక్పథాన్ని చాటుకున్నారు.

CM VD Satheesan has won widespread praise online after a video showed him standing up from his chair

రోడ్ సేఫ్టీలో భాగంగా ఎర్నాకుళం టౌన్ హాల్ లో ప్రభుత్వం చేపట్టిన జీవ సుయాత్ర మిషన్ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మమ్ముట్టి, ఇతర మంత్రులు దీనికి హాజరయ్యారు. వేదిక మీదికి వచ్చిన తర్వాత ఎన్‌సీసీ మహిళా క్యాడెట్ మొదట సతీషన్ చేతికి బాంబూ ప్లాంట్ ను ఇచ్చారు. ఆ వెంటనే గౌరవసూచకంగా సెల్యూట్ చేశారు. ఆమె సెల్యూట్ చేయడాన్ని గమనించలేదు సతీషన్. లేచి నిల్చొని బాంబూ ప్లాంట్ ను అందుకున్న ఆయన దాన్ని తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టడానికి ప్రయత్నించారు.

అక్కడ స్థలం లేకపోవడంతో దాన్ని సర్దడంపైనే దృష్టి పెట్టారు. అప్పటివరకూ ఆ ఎన్‌సీసీ క్యాడెట్ సెల్యూట్ చేస్తూ అక్కడే నిల్చొన్నారు. బాంబూ ప్లాంట్ ను సర్దిపెట్టి కుర్చీలో కూర్చునేటప్పుడు ఆమెను గమనించారు సతీషన్. మొదట ఆశ్చర్యపోయారు. అప్రయత్నంగా లేచి నిల్చొన్నారు. చిరునవ్వుతో సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వైరల్ అయింది. చక్కర్లు కొడుతోంది. వందల సంఖ్య కామెంట్స్ పోస్ట్ అయ్యాయి. సతీషన్ సింప్లిసిటీని నెటిజన్లు మెచ్చుకుంటోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+