ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు సీఎం విజయ్.. మద్రాస్ హైకోర్టు తీర్పుపై సవాల్!

తమిళనాడు టీవీకే ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మతాంతర మార్పిడి ద్వారా ఇస్లాం స్వీకరించిన వారికి వెనకబడిన తరగతుల(బీసీ) కింద రిజర్వేషన్ల ప్రయోజనాలను కల్పించడాన్ని మద్రాస్ హైకోర్టు గతంలో వ్యతిరేకించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు కొట్టేయగా.. ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ సీఎం విజయన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2024లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక ఉత్తర్వు జారీ చేసింది. వెనుకబడిన వర్గాలు(బీసీ), అత్యంత వెనుకబడిన వర్గాలు(ఎంబీసీ), డినోటిఫైడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వ్యక్తులను వెనుకబడిన తరగతిగా పరిగణించాలని ఆ జీవోలో పేర్కొంది. ఆ ఉత్తర్వుల ఆధారంగానే లబ్ధిదారులకు కమ్యూనిటీ ధ్రువీకరణ పత్రాలను కూడా జారీ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా అన్సార్, దక్కని ముస్లిం, దుబేకుల, లబ్బాయిస్, రౌథర్, మరకాయర్, మపిల్లా, షేక్, సయ్యద్ వంటి ముస్లిం వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తింపజేశారు.

CM Vijay Challenges Madras High Court Order on Muslim Reservation Tamil Nadu Approaches Supreme Court

అయితే తమిళనాడు సర్కారు ఉత్తర్వులపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ పీబీ బాలాజీలతో కూడిన డివిజన్ ధర్మాసనం ఈ రిజర్వేషన్ల జీవో రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. గతంలో హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ న్యాయపరమైన తీర్పులకు ఈ ఉత్తర్వులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తిని కేవలం ముస్లింగా మాత్రమే పరిగణించవచ్చని.. అంతే కానీ వారికి బీసీ హోదా కింద రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదని స్పష్టం చేసింది.

మద్రాస్ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గోవధ నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్ల తర్వాత.. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ల రక్షణ కోసం టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టు గడప తొక్కింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జులై 4, 2026 నాడు సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పరిధిపై ప్రభావం చూపించే ఈ కేసుపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+